GAJA VAHANA SEVA HELD _ గజ వాహనంపై శ్రీ సీతారాములు

VONTIMITTA, 05 APRIL 2023: The Gaja Vahana Seva on Wednesday night at Vontimitta after Sri Sita Rama Kalyanam.

Sri Rama paraded along the four mada streets to bless His devotees.

On Thursday morning Rathotsavam will be observed.

Deputy EO Sri Natesh Babu, Special Officer Manuscript Smt Vijayalakshmi and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గజ వాహనంపై శ్రీ సీతారాములు
 
ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 05: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం తరువాత గజవాహనంపై శ్రీ సీతారాములు భక్తులకు అభయమిచ్చారు. సీతారాములు మాత్రమే కలిసి విహరించే ఈ వాహనానికి ఎంతో విశిష్టత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో కానీ, రాజదర్బారులలో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో గజేంద్రుడు రాములవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.