GAJA VAHANA SEVA OBSERVED _ గ‌జ వాహ‌నంపై శ్రీ గోవిందరాజస్వామి అభ‌యం

Tirupati, 23 May 2021: On Sunday evening, during the ongoing annual Brahmotsavams of Sri Govindaraja Swamy seated on Gaja vahanam to bless His devotees.

Due to Covid guidelines, the Vahana Seva was observed in Ekantam.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, Special Grade DyEO Sri Rajendrudu and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గ‌జ వాహ‌నంపై శ్రీ గోవిందరాజస్వామి అభ‌యం

తిరుపతి, 2021 మే 23: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారు గ‌జ వాహ‌నంపై అభయమిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ నిర్వ‌హించారు.

హైందవ సనాతన ధర్మంలో రాజసానికి, రణరంగంలో గానీ, రాజదర్బారులో గానీ, ఉత్సవములలో గానీ గజానిదే అగ్రస్థానం. సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మీదేవికి ఇష్టవాహనం అయిన గజవాహనం స్వామివారికి వాహనంగా విశేష‌ సేవలు అందిస్తోంది.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీ ఎటి శ్రీనివాస దీక్షితులు కంక‌ణ బ‌ట్టార్ శ్రీ ఎ.టి. పార్థ‌సార‌ధి దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ కుమార్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ శ్రీ మునీంద్ర‌బాబు, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.