GAJA VAHANA SEVA TAKES PLACE AFTER A GAP OF TWO YEARS IN TIRUCHANOOR _ గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం

GAJA VAHANA SEVA TAKES PLACE AFTER A GAP OF TWO YEARS IN TIRUCHANOOR

HUGE TURN OUT OF DEVOTEES 

TIRUPATI, 24 NOVEMBER 2022: Finally, the much-awaited moment for the devotees who have been longing from the past two and a half years, has arrived on Thursday evening at 7pm when the Goddess of Riches, Sri Padmavathi Devi took out a celestial ride on Her favourite carrier Gaja Vahanam in Tiruchanoor on the fifth day evening as a part of the ongoing Karthika Brahmotsavams. 

Adding the extra glamour to the celestial beauty is the Lakshmi Kasula Haram brought from Tirumala which was adorned to Her to enhance the divine charm for this special and momentous occasion.

LIKE GARUDA SEVA FOR LORD GAJA FOR HIS CONSORT:

Like Garuda Vahanam which is considered to be most important vehicle for Lord Venkateswara at Tirumala, Gaja Vahanam is considered as the most prominent vehicle among various other Vahana sevas of Goddess Padmavathi.

SIBLING OF AIRAVATA:

Another important relation between the goddess and the divine pachyderm is that both emerged from the “Milk Ocean” during Ksheera Sagara Madanam. So the divine elephant Airavata also is the sibling of Goddess.

ELEPHANT SYMBOLISES ROYAL POWERS:

This significance for Divine elephant has been attributed in various ways with many puranic references. Elephant is not only considered mighty just because of its size but of its intelligence, martial skills and divinity but is often considered as the symbol of royalty.

Goddess Padmavathi represents wealth, prosperity, brightness, light, wisdom, fortune, fertility, generosity and courage. She symbolizes royal elegance, beauty, grace and charm and hence she prefers to take a pleasure ride on the “Royal Elephant” which is Her favourite ride during the Brahmotsavams.

HUGE TURN OUT OF DEVOTEES

As the annual fete is taking place after a gap of two years devotees turned out in large numbers to witness Gaja Vahana Seva of Goddess Padmavati in Tiruchanoor.

Both the Pontiffs of Tirumala, Agama Advisor Sri Srinivasacharyulu and other religious staff were present.

TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy, Collector Sri Venkatramana Reddy, TTD Ex-officio Sri Bhaskar Reddy, JEOs Smt Sada Bhargavi, Sri  Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, CE Nageswara Rao, DyEO Sri Lokanatham and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం

తిరుపతి, 2022 నవంబరు 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు గురువారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు రాత్రి పద్మావతి దేవి స్వర్ణ గజ వాహనంపై విహరిస్తారు . గజపటాన్ని ఆరోహణం చేయడంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అలమేలు మంగ వాహనసేవల్లో గజవాహన సేవకు ప్రత్యేకత ఉంది . గజం ఐశ్వర్యసూచకం. అందుకే ”ఆగజాంతగం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. పాలసముద్రంలో ప్రభవించిన సిరులతల్లిని గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణారెడ్డి దంపతులు, చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జేఈవోలు శ్రీ వీరబ్రహ్మం దంపతులు, శ్రీమతి సదా భార్గవి, సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ దంపతులు, సి ఇ శ్రీ నాగేశ్వరరావు, ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసచార్యులు, విఎస్వోలు శ్రీ మనోహర్, శ్రీ బాలి రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ మధు, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ దాము పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.