GAJA VAHANAM SEVA PERFORMED_ గజ వాహనంపై లోకాభిరాముడు

Tirupati, 21 March 2018: The pleasant evening on Wednesday, Lord Sri Rama was taken on a procession along four mada streets on the Gaja Vahanam.

Gaja, the elephant king is considered as symbol of royalty. Showcasing the mightiness of “Rama Rajya”, Lord took a pride ride on Gaja vahanam.

DyEO Smt Jhansi, Executive Engineer Sri Jagadeeswara Reddy, AVSO Sri Ganga Raju, Suptd Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy and other temple staffs, large number of devotees were also present


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

గజ వాహనంపై లోకాభిరాముడు

మార్చి 21, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం రాత్రి రాముల‌వారు గ‌జ‌వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహ‌న‌సేవ‌ వైభవంగా జరిగింది. హైందవ సనాతన ధర్మంలో గజ వాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో గానీ, రాజదర్బారుల్లో గానీ, ఉత్సవాల్లో గానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో గజేంద్రుడు శ్రీవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝన్సీరాణి, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.