GAMES AND SPORTS COMMENCE FOR EMPLOYEES _ ఘనంగా టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు-2021 ప్రారంభం

Tirupati, 21 Feb. 21: The annual Sports and Games 2021 commenced for TTD employees on Sunday in the Parade Grounds behind TTD Administrative Building.

In the Tug of War competition, Smt Shanti team stood as winners while Smt Kalpana team as Runners-up in the 45plus category.

While in the under 45years category Smt Padmaja team emerged winners while Smt Gangadevi team stood Runners.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఘనంగా టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు-2021 ప్రారంభం

తిరుపతి, 2021 ఫిబ్రవరి 21: తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం వైనక వైపు గల పరేడ్‌ మైదానంలో ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు -2021 ఆదివారం ఉద‌యం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఇందులో పురుషులు, స్త్రీల విభాగంలో 45 సం||రాల లోపువారికి, 45 సం||పైబడిన వారికి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు, దివ్యాంగ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఆటల పోటీలు నిర్వహిస్తారు.

పురుషుల విభాగంలో వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, లాన్‌ టెన్నిస్‌, క్యారమ్స్‌, చెస్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, కబడ్డీ, మహిళల విభాగంలో టగ్‌ ఆఫ్‌ వార్‌, బ్యాడ్మింటన్‌, టెన్నికాయిట్‌, క్యారమ్స్‌, చెస్‌, త్రోబాల్‌, డాడ్జిబాల్‌, కబడ్డీ పోటీలు నిర్వహించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనంద‌రాజు, ఇతర ఆధికారులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

టగ్‌ ఆఫ్‌ వార్‌ విజేతలు

మొదటిరోజు జరిగిన టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీల్లో విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.

– 45 ఏళ్లు పైబడిన మహిళల టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీల్లో శ్రీ‌మ‌తి శాంతి జట్టు విజయం సాధించగా శ్రీ‌మ‌తి క‌ల్ప‌న జట్టు రన్నరప్‌గా నిలిచింది.

– 45 ఏళ్ల లోపు మహిళల టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీల్లో శ్రీ‌మ‌తి ప‌ద్మ‌జ‌ జట్టు విజయం సాధించగా శ్రీ‌మ‌తి గంగాదేవి జట్టు రన్నరప్‌గా నిలిచింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.