GAMES AND SPORTS HELD FOR SPECIALLY ABLE EMPLOYEES _ క్రీడాపోటీల్లో దివ్యాంగ ఉద్యోగుల ప్రతిభ

TIRUPATI, 08 FEBRUARY 2023: As part of TTD Employees Annual Sports and Games Meet, the competitions were held to the specially-abled employees category on Wednesday.

For women and men partially blind and deaf employees Chess, Carroms and Passing the Luggage was held.

The employees participated in all these games with enthusiasm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

క్రీడాపోటీల్లో దివ్యాంగ ఉద్యోగుల ప్రతిభ

తిరుపతి, 08 ఫిబ్రవరి 2023: టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీల్లో భాగంగా బుధవారం జరిగిన పోటీల్లో పలువురు దివ్యాంగ ఉద్యోగులు ప్రతిభ కనబరిచారు.

– దివ్యాంగ మహిళా ఉద్యోగుల చదరంగం పోటీల్లో బి.అరుణ కుమారి విజేతగా నిలవగా, కె.విజయలక్ష్మి రన్నరప్ గా నిలిచారు.

– పాక్షిక అంధుల చెస్ పోటీల్లో సి.రెడ్డప్ప రెడ్డి విజేతగా నిలవగా, డి.త్యాగరాజు రన్నరప్ గా నిలిచారు.

– దివ్యాంగుల చెస్ పోటీల్లో కె.రవి కుమార్ విజేతగా నిలవగా, ఎంఏవీ సత్యం రన్నరప్ గా నిలిచారు.

– బధిర మహిళల క్యారమ్స్ పోటీల్లో కె.మునివెంకట ప్రసన్న విజేత కాగా, ఎల్.కుమారి రన్నరప్ గా నిలిచారు.

– బధిర పురుషుల క్యారమ్స్ పోటీల్లో చంద్రశేఖర్ విజేత కాగా, మధుసూదన శర్మ రన్నరప్ గా నిలిచారు.

– బధిర పురుషుల క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో చంద్రశేఖర్, శ్రీబాబు విజేతలు కాగా, బి.శ్రీకాంత్, డి.శ్రీనివాసులు రన్నర్స్ గా నిలిచారు.

– 45 సంవత్సరాల లోపు మహిళల పాసింగ్ ది లగేజ్ పోటీల్లో రమాదేవి జట్టు విజయం సాధించగా, ఎం.సునంద జట్టు రన్నరప్ గా నిలిచింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.