GANAPATI HOMAM PERFORMED AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో గణపతి హోమం

Tirupati, 17 Nov. 20: As part of month long Karthika special religious celebrations, TTD on Tuesday organised the Ganapati Homam at the Sri Kapileswara Swamy temple in Tirupati.

Besides special decorations for the Ganapati idol in the temple complex, Archakas performed Puja, Japam, Ganapati Homa, Laghu Purnahuti and Nivedana.

The favourite dishes of Ganapati like Ghee rice, Jaggery, Bananas and Kudumulu were offered and 16 Ganapati Namas were chanted.

Thereafter in the evening also Japam, Sri Ganapati Sahasra Namarchana, Nivedana, Special Dedparadhana, Mantra Pushpam and Harati were offered.

Meanwhile, Ganapati Homa will be conducted on Wednesday November 18 as well.

Temple DyEO Sri Subramaniam, Superintendent Sri Bhupathi, Temple Inspector Sri Reddy Sekhar and others participated.

KARTHIKA SPECIAL PUJAS AT KAPILA THIRTHA AND DHYANARAMAM

On Tuesday morning TTD organised Trilochana Gauri Vratam at Sri Kapileswara Swamy temple.

Eminent Vedic scholar Sri Rani Sadashiva Murthy from National Sanskrit University rendered discourse extolling the significance of the vratam.

AT DHYANARAMAM

At the Dhyanaramam near Alipiri, TTD organised Rudrbhisekam in early hours of Tuesday in which acharyas and students of SV Vedic University participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో గణపతి హోమం
 
తిరుపతి, 2020 న‌వంబ‌రు 17: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌‌వారం గణపతి హోమం జ‌రిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.
 
ఆలయ ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ వినాయకస్వామి ప్రతిమకు విశేష అలంకరణ చేపట్టారు. ఉదయం 9.00 నుండి 12.00 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో అర్చక బృందం పూజ, జపం, గణపతి హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన నిర్వహించారు. వినాయకుడికి ప్రీతిపాత్రమైన కుడుములు, నెయ్యి, అన్నం, అటుకులు, బెల్లం, అరటిపండ్లు తదితర అష్టద్రవ్యాలతో హోమం చేపట్టారు. ఇందులో 16 నామాలతో గణపతిని స్తుతించారు.
 
కాగా సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు జపం, హోమం, శ్రీ గణపతి సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, మంత్రపుష్పం మరియు హారతి ఇవ్వనున్నారు. న‌వంబరు 18వ తేదీ కూడా గణపతి హోమం జరుగనుంది. 
 
ఈ కార్యక్రమంలో ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రిండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
క‌పిల‌తీర్థం, ధ్యానారామంలో కార్తీక మాస పూజ‌లు
 
కార్తీక మాసం సంద‌ర్బంగా టిటిడి ఆధ్వ‌ర్యంలో క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య ప్రాంగ‌ణంలో  మంగ‌ళ‌వారం ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు త్రిలోచ‌న గౌరి వ్ర‌తం నిర్వ‌హించారు. 
 
ప్ర‌ముఖ పండితులు, జాతీయ సంస్కృత విశ్వ విద్యాల‌యం ఆచార్యులు రాణి స‌దాశివ‌మూర్తి త్రిలోచ‌న గౌరి వ్ర‌తం విశిష్టత గురించి వివ‌రించారు. 
 
ధ్యానా‌రామంలో …
 
కార్తీక మాసం సంద‌ర్భంగా అలిపిరి స‌మీపంలోని ధ్యానారామంలో  ఉద‌యం 6.00 నుండి 6.45 గంట‌ల వ‌ర‌కు వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, విద్యార్థుల‌చే మ‌హాశివుడికి రుద్రాభిషేకం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా న‌మ‌కం, చ‌మ‌కం, మ‌హాహ‌ర‌తి జ‌రిగాయి. 
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.