GANGUNDRA MANDAPAM FETE HELD _ గంగుండ్ర మండపానికి శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల వేంచేపు
Tirupati, 04 January 2023: In connection with Vaikuntha Dwadasi Sri Sita Rama Lakshmana from Sri Kodanda Ramalayam were brought to Gangundra Mandapam street on Wednesday in Tirupati and special pujas were performed.
Temple staff were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గంగుండ్ర మండపానికి శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల వేంచేపు
తిరుపతి, 04 జనవరి 2023: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం నుంచి శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను బుధవారం గాంధీ రోడ్డు వద్ద గల గంగుండ్ర మండపానికి వేంచేపు చేశారు.
వైకుంఠ ద్వాదశి మరుసటి రోజున ఉభయదారుల కోసం గంగుండ్ర మండపానికి ఉత్సవమూర్తులను వేంచేపు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులను తీర్థకట్ట వీధి మీదుగా ఊరేగింపుగా తీసుకెళ్లి పూజల అనంతరం తిరిగి కోదండరామాలయానికి తీసుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీ ఆనందకుమార దీక్షితులు, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్ ఇతరులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.