GARUDA GAMANA GARUDA DHWAJA… _ గ‌రుడ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప సాక్షాత్కారం

Tirumala, October 2022: The entire Hill Town of Tirumala reverberated Garuda Vahana Govinda Govinda…with tens of thousands of voices chanting the divine name univocally as soon as the curtains in vahana mandapam were raised to give way for Garuda Vahanam.

On the fifth day of ongoing annual Brahmotsavams on Saturday in Tirumala, the most significant of all the vahana sevas of mega religious festival  – Garuda vahana seva was performed with utmost spiritual fervour and devotion which enthralled the scores of devotees who thronged the sacred mada streets and occupied every inch of tge galleries since early hours of the day to witness the grandeur of Malayappa on the mighty Garuda.

It is a sea of humanity at Tirumala as all roads from Tirupati led to Tirumala were brimming with activity. The foot paths – Alipiri and Srivari Mettu and the ghat roads to Tirumala were flooded with devotees.

Garuda Gamana Garudadhwaja Sri Malayappa appeared on His favourite carrier decked with the precious jewellery worn by the Mula Virat (main idol Sahasranama Kasulamala, Chaturbhuja Lakshmi haram, and  Makaai Kanti (donated by Mysore Maharaja) on the auspicious occasion.

IMPORTANCE

Garuda or the Eagle is the favorite vehicle of Lord Vishnu. Besides being the daily transport, Garuda has also occupied the top slot in the Dhwajam that heralded the commencement of the Brahmotsavams.

As the Key watcher of happenings around Lord Vishnu, Garuda also supervises the entire Srivari Brahmotsavam,says the legends.

Garuda Seva is a well-known festival that is being observed in all the 108 Sri Vaishnava Divya Desams. It is strongly believed that the Darshan of the Universal deity on the mighty Garuda would shower boons and wash out all sins and bring good fortunes.

HH Sri Pedda Jeeyar and Sri Chinna Jeeyar Swamijis of Tirumala, the Honourable CJI Justice UU Lalith, CJ of AP High Court Justice Prasanth Kumar Misra, CJ of TN High Court Justice T Raja, TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy, board members, officials were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

గ‌రుడ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప సాక్షాత్కారం

తిరుమల, 2022 అక్టోబ‌రు 01: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ‌నివారం రాత్రి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు త‌న‌కెంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్త‌కోటికి ద‌ర్శ‌న‌మిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండ‌గా భక్తుల కోలాటాలు, డ్రమ్స్‌ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా సాగింది. అన్ని గ్యాల‌రీల వ‌ద్ద స్వామివారిని అటు ఇటు తిప్పుతూ భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

కాగా, బ్రహ్మోత్సవాలలో ఆరో రోజైన ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు హ‌నుమంత వాహ‌నం, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు గ‌జ‌వాహనంపై శ్రీవారు భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్ స్వామి శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు.లలిత్, ఎపి హైకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.