GARUDA GAMANA RAMA _ గ‌రుడ‌ వాహనంపై శ్రీ కోదండ‌‌రాముడు కటాక్షం

TIRUPATI, 09 APRIL 2024: On the fifth evening of the ongoing annual Brahmotsavam in Sri Kodandarama Swamy temple, Sri Ramachandra atop the mighty Garuda Vahanam blessed His devotees.

Led by caparisoned elephants, horses, bulls, Sri Rama paraded along the streets.

The kolatams and dance troupes enhanced the grandeur of the procession.

HH Sri Pedda Jeeyar Swamy, HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, JEO Sri Veerabrahmam, DyEO Smt Nagaratna, VGO Sri Bali Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గ‌రుడ‌ వాహనంపై శ్రీ కోదండ‌‌రాముడు కటాక్షం

తిరుపతి, 2024 ఏప్రిల్ 09: తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ‌రోజు మంగళవారం రాత్రి 7 గంటలకు గ‌రుడ‌ వాహనంపై స్వామివారు క‌టాక్షించారు.

గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.

గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, విజివో శ్రీ బాలి రెడ్డి, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ‌శేఖ‌ర్‌, కంకణభట్టర్ శ్రీ సీతారామాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.