GARUDA PANCHAMI ON JULY 25 _ జూలై 25న గరుడ పంచమి

Tirumala, 23 Jul. 20: TTD is organising Garuda Seva on the auspicious day of Panchami at Tirumala which occurs on Saturday, July 25.

In view of COVID-19 restrictions, the annual festival will take place
in Ekantkam within the Srivari temple premises between 5pm and 6pm.

The legends say that annual fete was performed for sake of newly wed
couple and to beget them children born with power, strength and
stamina like Garuda.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూలై 25న గరుడ పంచమి

తిరుమల, 2020 జూలై 23: తిరుమ‌ల‌లో జూలై 25వ తేదీ శ‌ని‌వారంనాడు గరుడ పంచమి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకొని శ్రీ‌వారి ఆల‌యంలోని రంగనాయ‌కుల మండ‌పంలో సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఇష్టవాహనమైన గరుడ వాహ‌నాన్ని అధిరోహించ‌నున్నారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా శ్రీ‌వారి ఆల‌యంలో గ‌రుడ పంచ‌మిని ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.

ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.