GARUDA SEVA OBSERVED ON FULL MOON DAY_ తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

Tirumala, 25 September 2018: Following Pournami on Tuesday, Garuda Seva was observed with religious fervour in Tirumala.

Nalayira Divya Prabandha Parayanam was also rendered by 220 Sri Vaishnava pundits in front of the procession.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, temple DyEO Sri Harindranath and others were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

సెప్టెంబరు 25,  తిరుమల 2018: తిరుమలలో మంగళవారంనాడు రాత్రి 7.00 గంటలకు పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవను నిర్వహిస్తున్న విషయం విదితమే.

భక్తులలో మరింత భక్తి భావం పెంచిన నాలాయిర దివ్య ప్రబంధ పారాయణం

శ్రీవారి గరుడవాహనం ముందు నాలాయిర దివ్య ప్రబంధ పారాయణం భక్తులలో మరింత భక్తి భావాన్ని పెంచింది. టిటిడి ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశం నలుమూల నుండి విచ్చేసిన 220 మంది వేద పండితులు పలు పాశురాలను అలపించారు. 

కాగా గరుడసేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల నాలుగుమాఢ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. ధర్మప్రచారపరిషత్‌ మరియు అన్నమాచార్యప్రాజెక్టు కళాకారులతో నాలుగుమాడ వీధులలో భజనలు, కోలాటాలు, చెక్క భజనలు కోలాహాలంగా నిర్వహించారు.

జగన్నాటక సూత్రధారియైన శ్రీమలయప్పస్వామివారు మంగ‌ళ‌వారం రాత్రి గరుడవాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరిని క‌టాక్షించాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో  తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు,  ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.