GARUDA SEVA ENTHRALLS DEVOTEES_ తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

Tirumala, 9 July 2017: On the auspicious day of Guru Pournami on Sunday, the Garuda Seva enthralled the pilgrims.

Lord Sri Malayappa Swamy took celestial ride on Garuda Vahanam and blessed the devotees along the four mada streets.

TTD CVSO Sri A Ravikrishna, Temple DyEO Sri Rama Rao, Peishkar Sri Ramesh and others took part.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

జూలై 09, తిరుమల, 2017: తిరుమలలో ఆదివారంనాడు రాత్రి 7 గంటలకు పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవను నిర్వహిస్తున్నది విదితమే.

కాగా గరుడసేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల నాలుగుమాడ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. ధర్మప్రచారపరిషత్‌ మరియు అన్నమాచార్యప్రాజెక్టు కళాకారులతో నాలుగుమాడ వీధులలో భజనలు, కోలాటాలు, చెక్క భజనలు కోలాహాలంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తి.తి.దే. ఎస్‌.ఓ. శ్రీ ఎ.రవికృష్ణ, ఆలయ డిప్యూటి ఇ.ఓ శ్రీ కోదండరామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.