GARUDA SEVA OBSERVED ON GARUDA PANCHAMI DAY _ గ‌రుడ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Tirumala, 25 Jul. 20: The annual Garuda Panchami Garuda Seva fete was observed in Tirumala temple on Saturday evening. 

Sri Malayappa Swamy seated on Garuda Vahana and the seva was observed in Ekantam in Ranganayakula Mandapam in view of COVID 19 restrictions. 

HH Sri Chinna Jiyar Swamy, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Harindranath, Temple Peishkar Sri Jaganmohanachari were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గ‌రుడ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి
     
తిరుమల, 2020 జూలై 25: గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ‌ని‌వారం సాయంత్రం 5.00 నుండి 6.00 గంట‌ల వ‌ర‌కు తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌క మండ‌పంలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడ వాహ‌నాని అధిరోహించారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా గ‌రుడ వాహ‌న సేవ‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.    

 శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా  ”గరుడ పంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు చేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్, ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.