GARUDA VAHANA SEVA HELD WITH RELIGIOUS FERVOUR _ గరుడ వాహనంపై సకలలోక రక్షకుడు శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌రుడు

Tirupati, 24 Feb. 22: Garuda Vahana Seva was held with spiritual ecstasy on Thursday evening at Srinivasa Mangapuram.

 

On the fifth day evening, Sri Kalyana Venkateswara in all his grandeur seated on Garuda Vahana which was decked with Laksmi kasulamala brought from Tirumala temple.

 

Due to Covid restrictions this Vahana seva took place in Ekantam.

 

Additional EO Sri AV Dharma Reddy, JEOs, Smt Sada Bhargavi, Sri Veerabrahmam, Trust board member Sri Chavireddy Bhaskar Reddy, Sri P Ashok, CVSO Sri Gopinath Jatti, Deputy EO Smt Shanti and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

గరుడ వాహనంపై సకలలోక రక్షకుడు శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌రుడు

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 24: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం రాత్రి సకలలోక రక్షకుడైన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌రస్వామి తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గ‌రుడ వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న‌సేవ‌ ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం :

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.

వాహ‌న‌సేవ‌లో అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు చంద్ర‌గిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి దంపతులు,
శ్రీ పోకల అశోక్ కుమార్ దంపతులు, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, విజివోలు శ్రీ బాలి రెడ్డి దంపతులు, శ్రీ మనోహర్, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయలు, శ్రీ రమణయ్య, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.