GARUDA VAHANA SEVA IN SUNDERARAJA SWAMY AVATAROTSAVAM _ గరుడ వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి కటాక్షం ముగిసిన అవతార మహోత్సవాలు

Tiruchanoor, 25 Jun 19:On the last day of the three day Sunderaraja Swamy Avatarotsavams at Tiruchanoor on Tuesday evening, the Lord was taken on Garuda Vahana Seva.

After the morning rituals, abhishekam, unjal seva in the evening, the processional deity of Sri Sunderaraja Swamy was taken on a celestial procession on Garuda Vahanam.

Temple DyEO Smt Jhansi Rani, other temple staff, devotees are also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గరుడ వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి కటాక్షం ముగిసిన అవతార మహోత్సవాలు

తిరుపతి, 2019 జూన్‌ 25;తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు సాయంత్రం స్వామివారు గరుడవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.00 నుండి 3.30 గంటల వరకు ముఖమండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్ళతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌ సేవ వైభవంగా జరుగనుంది.

అనంతరం ఆలయం బయట గల వాహనమండపంలో శ్రీసుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీరాణి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణా, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.