DEVOTEES WILL WITNESS TWIN GARUDA SEVAS THIS MONTH_ ఆగస్టులో రెండు సార్లు గరుడవాహనంపై ఊరేగనున్న శ్రీవారు

Tirumala, 5 August 2018: The monthly pournami Garuda Seva was cancelled in the month of July due to lunar eclipse.

Now they will have a double dhamaka as two Garuda Sevas are being observed in August.

The first one on August 16 on the auspicious day of Garuda Panchami and the second one on August 26 on the day of Sravana Pournami. On both the days, Sri Malayappa Swamy will take ride on golden Garuda Vahanam in four mada streets between 7pm and 9pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆగస్టులో రెండు సార్లు గరుడవాహనంపై ఊరేగనున్న శ్రీవారు

తిరుమల, 2018 ఆగస్టు 05: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఆగస్టు నెలలో రెండుసార్లు గరుడవాహనసేవ జరుగనుంది. ఆగస్టు 16వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 26వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

ఆగస్టు 16న గరుడ పంచమి

ఆగస్టు 16వ తేదీ గురువారంనాడు గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు సాయంత్రం 5.00 నుండి 6.30 గంటల వరకు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.

శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుత్మంతుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్ల పక్షమి ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ”గరుడపంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు పూజిస్తారని ప్రాశస్త్యం.

ఆగస్టు 26న శ్రావణ పౌర్ణమి

ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడసేవను ఆగస్టు 26వ తేదీ ఆదివారంనాడు శ్రావణ పౌర్ణమినాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ నాలుగు వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.