PARADE OF GARUDA VAHANAM ATTRACTS DEVOTEES_ గరుడ వాహనంపై లోకమాత :

Tiruchanoor, 9 December 2018: On the sixth day of ongoing annual karthika brahmotsavams in Tiruchanoor, Goddess Padmavathi Devi took celestial ride on Garuda Vahanam and cheered the devotees.

Every inch of the temple centre was occupied by devotees who wanted to catch a glimpse of goddess on the mighty bird king.

The deity in all Her splendour was decked with Lakshmi Kasula Haram brought from Tirumala and golden Padalu during this auspicious vahana seva.

TTD EO Sri AK Singhal, Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jatti, ACVSO Sri Sivakumar Reddy,Dy.EO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Suptd Sri Gopalakrishna Reddy and others were present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

గరుడ వాహనంపై లోకమాత

తిరుపతి, 2018 డిసెంబరు 09: రాత్రి 8.00 నుండి 11.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి గరుడ సేవ వైభవంగా జరుగనుంది.

గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా సంప్రదాయజ్ఞులు సన్నుతిస్తున్నారు. శ్రీవారినీ, అమ్మవారినీ నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా ఇంకా పలు విధాలుగా సేవిస్తున్నారు. గరుడపచ్చను వక్షఃస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా జీవాంతరాత్మకుడై చిన్మయుడై నిజసుఖాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షసుఖం కరతలామలకం అవుతుంది.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీ గోపినాధ్‌జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమ‌తి ఝ‌న్సీరాణి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.