GARUDA VAHANAM OBSERVED ON VYASA PURNIMA _ శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆషాడ మాస గురు పౌర్ణమి గరుడ సేవ

TIRUMALA, 03 JULY 2023: On the auspicious day of Guru Pournami also known as Vyasa Purnima, Garuda Seva was observed with religious fervor in Tirumala on Monday evening between 7 pm and 9 pm.

Every month on the full moon day, TTD observes Garuda Vahanam. Sri Malayappa Swamy in all His splendor took a celestial ride on the finely decked Garuda Vahanam to bless His devotees who congregated in the galleries of four mada streets.

Both the pontiffs of Tirumala, Temple DyEO Sri Lokanatham, VGO Sri Bal Reddy, and other officials were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆషాడ మాస గురు పౌర్ణమి గరుడ సేవ

తిరుమ‌ల‌, 2023 జూలై 03 ; తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజిఓ శ్రీ బాలిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.