GEAR UP FOR RATHASAPTHAMI-TIRUMALA JEO_ రథసప్తమికి విస్తృతంగా ఏర్పాట్లు : జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
Tirumala, 09 January 2018: As the hill shrine of Tirumala is gearing up to host another big religious event annual Rathasapthami, the first major event in 2018 calendar, Tirumala JEO Sri akS Sreenivasa Raju has instructed the heads of various departments to gear up for the same.
During the weekly review meeting held at Annamaiah Bhavan in Tirumala on Tuesday, the JEO instructed the HoDs to come out with a detailed action plan to execute the services to the pilgrims on the big day with more efficiency in their significant areas.
He instructed every one to be keen in their arrangements and there should not be any problem to devotees.
Later speaking to media persons he briefed on thr arrangements for the big fest.
Some exerpts:
Also known as Surya Jayanthi, Lord Malayappa takes ride on seven vahanams on January 24 from morning to evening with Chakrasnanam between 2pm and 3pm.
TTD cancelled aged, PHC, parents with infants darshan, Arjitha sevas and VIP break owing to festival.
Divya darshan and Rs.300 darshan will be allowed as usual.
Elaborate arrangements of annaprasadam and water are being planned. Eight lakhs water and 1.5lakh butter milk packets.
19 LED giant screens to be arranged. Special floral decorations.
3000 Srivari Seva volunteers, 800 scouts and guides to render services to pilgrims.
Senior officers to be deployed in each mada street to vigil and supervise the amenities that are being provided to pilgrims.
No harati except Circar harati during each vahana seva.
Recitation of Aditya Hrudayam by students of Balamandiram during Surya Prabha Vahana seva
SVBC to relay all vahana sevas live for global devotees.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
రథసప్తమికి విస్తృతంగా ఏర్పాట్లు : జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
తిరుమల, జనవరి 09, 2018: తిరుమల శ్రీవారి ప్రధానమైన ఉత్సవాల్లో ఒకటైన రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. ఈ పర్వదినం ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టిటిడి అధికారులతో జెఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆయా విభాగాల అధికారులు వివరణాత్మకంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి ఏర్పాట్లను వివరించారు.
– జనవరి 24న సూర్యజయంతి సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు సప్తవాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.
– ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆర్జితసేవలు, విఐపి బ్రేక్ దర్శనం, వయోవృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేయడమైనది.
– దివ్యదర్శనం టోకెన్లు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు యథావిధిగా ఉంటాయి.
– భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు. ఇందుకోసం 8 లక్షల తాగునీటి ప్యాకెట్లు, 1.5 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుతారు.
– వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా 19 ఎల్‌ఇడి స్క్రీన్లు. ప్రత్యేకంగా పుష్పాలంకరణలు.
– 3 వేల మంది శ్రీవారి సేవకులు, 800 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలందిస్తారు.
– భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు మాడ వీధుల్లో సీనియర్ అధికారులకు విధులు కేటాయిస్తారు.
– వాహనసేవల్లో సర్కార్ హారతి మాత్రమే ఉంటుంది. ఇతర హారతులు ఉండవు.
– సూర్యప్రభ వాహనసేవలో ఎస్వీ బాలమందిరం విద్యార్థులు ఆదిత్య హృదయం పారాయణం చేస్తారు.
– ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవల ప్రత్యక్షప్రసారం.
– జనవరి 25 నుంచి 28వ తేదీ వరకు ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలను పరిమితం చేయడం జరిగింది.
అన్నమయ్య భవనంలో జరిగిన సమావేశంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, విఎస్‌వోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి, ఆరోగ్యశాఖాధికారిణి డా|| శర్మిష్ట ఇతర అధికారులు పాల్గొన్నారు.
—————————————————————
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.