GEITY MARKS RADHOTSAVAMవైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం

DEVOTEES TAKE PART WITH ENTHUSIASM 

VONTIMITTA, 23 APRIL 2024: One of the most important festivities in the Sri Rama Navami Brahmotsavams in Vontimitta Kodanda Ramalayam, the Radhotsavam was observed with piety on Tuesday.

This wooden chariot which commenced in the morning will last till evening. The locals and devotees participate with great devotion and enthusiasm to pull the massive chariot along the temple streets chanting ”Jai Sriram”.

The deities of Sri Rama, Sri Devi and Sri Lakshmana Swamy were decked with dazzling jewels and garments and seated on a platform atop the Radham.

The devotees cheered the deities and offered Haratis at every junction all through the massive wooden chariot procession.

TTD officials and devotees were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం

ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 23: ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 10.15 గంటలకు రథోత్సవం ప్రారంభమైంది.
శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు. భజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు.

ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ‌ నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, ఇంజినీరింగ్ అధికారులు, పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది