GET READY WITH PANCHA GAVYA PRODUCTS BY VAIKUNTA EKADASI – TTD EO _ వైకుంఠ ఏకాదశి కి అందుబాటులోకి పంచగవ్య ఉత్పత్తులు

PREPARE DPR OF CHILDREN’S HOSPITAL TO BEGIN CONSTRUCTION

Tirumala, 28 November 2021: TTD EO Dr. KS Jawahar Reddy has directed officials to gear up for the production of Pancha Gavya products by Vaikunta Ekadasi.

Addressing a review meeting at Sri Padmavati Rest House on Sunday in Tirupati, the TTD EO asked officials to design a brand name for the Pancha Gavya products being produced by TTD using Desi cow residues like cow dung, urine, etc.

He advised setting up a committee to purchase Desi breeds from Gujarat and Rajasthan which gives more milk, butter, ghee needed for Srivari Naivedyam.

He said the committee should comprise of a scientist from NDRI, a professor each from an LPM(Livestock Production Management ), NBAGR(National Bureau of Animal Genetic Resources), a skilled Dairy farmer, a donor, besides Dr. Harnath Reddy, the Director of SV Gosamrakshanashala, and headed by Dr. G Venkata Naidu, the Director of Extension, SV Veterinary University in Tirupati.

Among others he asked officials to gather bovines that gave milk throughout the year, prepare necessary shelter, fodder, and mixed feed when the Desi breed is brought.

Reviewing the activities of Sri Padmavati children’s hospital, the TTD EO also directed officials to begin tender proceedings for procuring essential medical equipment for the hospital and also interact with donors if ready to provide support to the Hospital.

He said the DPR for the hospital should be prepared with G+5 floors along with cost estimates after consulting expert doctors etc.

Jeo Smt Sada Bhargavi, Sri Veerabrahmam, FA&CAO Sri O Balaji, Dr. Srinath Reddy, Director of SP Children’s  Hospital, Chief Medical Officer Dr. Muralidhar, CSRMO Sri Sesha Shailendra, IT Chief Sri Shesha Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వైకుంఠ ఏకాదశి కి అందుబాటులోకి పంచగవ్య ఉత్పత్తులు
– చిన్న పిల్లల ఆసుపత్రి భవనాల నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం చేయండి
– అధికారులకు ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి ఆదేశం

తిరుపతి 28 నవంబరు 2021: టీటీడీ ఆధ్వర్యంలో తయారవుతున్న పంచగవ్య ఆధారిత ఉత్పత్తులను వైకుంఠ ఏకాదశి నాటికి భక్తులకు అందుబాటులోకి తేవాలని ఈవో డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, పంచగవ్య ఉత్పత్తులకు బ్రాండ్ నేమ్ సిద్ధం చేయాలని అధికారులు చెప్పారు.

అధిక పాల చార గల దేశీయ గోవులను గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడానికి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిరుమల శ్రీవారికి నిత్యం సమర్పించే నైవేద్యాల తయారీకి అవసరమయ్యే పాలు, వెన్న, నెయ్యి ఈ గోవుల నుంచే సేకరించాలని చెప్పారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్
జి.వెంకట నాయుడు, ఎస్వీ గోసంరక్షణ శాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, ఎల్ పి ఎం, ఎంబీఏజిఆర్ నుంచి ఒక్కో ప్రొఫెసర్, ఎన్ డి ఆర్ ఐ నుంచి ఒక సైంటిస్ట్, నైపుణ్యం కలిగిన రైతు, ఒక దాత తో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. గోజాతి పునరుత్పత్తి సామర్థ్యం గురించి ఈవో ప్రస్తావిస్తూ, సంవత్సరానికి ఒక డూడను ఇచ్చి, సంవత్సరం మొత్తం పాలిచ్చే ఆవులను సేకరించాలని చెప్పారు. స్వదేశీ గో జాతులు వచ్చాక వాటికి అవసరమైన వసతి, గ్రాసం, మిశ్రమ దాణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆస్పత్రి కార్యకలాపాలపై ఈవో సమీక్షించారు. చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని చెప్పారు. ఇందుకు అవసరమైన టెండర్ ప్రక్రియ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒక వేళ దాతలు ఎవరైనా ముందుకొస్తే వారి సేవలు ఉపయోగించుకోవాలన్నారు. ఆస్పత్రికి నూతన భవనాల నిర్మాణం కోసం జి ప్లస్ ఫైవ్ తో డి పి ఆర్ సిద్ధం చేయాలని, ఇందులోనే నిర్మాణ అంచనా వ్యయం కూడా పొందుపరచాలని ఆయన చెప్పారు. నిపుణులైన డాక్టర్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం కోసం సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.

జెఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర బ్రహ్మం, ఎఫ్ ఎ సి ఎ ఓ శ్రీ బాలాజి, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, పశువైద్య విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ టెన్షన్ డాక్టర్ వెంకట నాయుడు, చిన్న పిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్, సి ఎస్ ఆర్ ఎం ఓ శ్రీ శేష శైలేంద్ర, ఐటి ఇంచార్జ్ శ్రీ శేషారెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది