GEYADHARA AND MUSICAL FETE ENTHRALLS _ వెంగమాంబ జయంతి ఉత్సవాల్లో విశేషంగా ఆకట్టుకున్న సంగీత

TIRUPATI, 21 MAY 2024: The Avadhana Geyadhara and Tarigonda Vengamamba Sankeertana Vaibhavam enthralled the audience on Tuesday evening.

As a part of two two-day literary and cultural fete organised by Tarigonda Vengamamba Project of TTD in the Annamacharya Kalamandiram in Tirupati.

The Sangeeta Avadhanam was executed with finesse by SVBC Chairman Dr Sai Krishna Yachendra.

The program was presided over by former SKU VC Dr Kusuma Kumari, while Scholar Sri Amudala Murali acted as Nishiddhakshari and Sri Hemanth as Aprastuta Prasangam.

The program mused the literary and music lovers of Tirupati.

Later renowned singer Smt Srinidhi and her team presented Vengamamba kritis like “Jaya Rama Hrudayesha… Jaya Venkatesa..”, Tarigonda Narasimha, .. Maa Nathudede Oyamma and many others in a melodious manner.

SVETA and Vengamamba Project Director Sri Bhuman Subramanyam Reddy, Annamacharya Project Director Dr Vibhishana Sharma and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వెంగమాంబ జయంతి ఉత్సవాల్లో విశేషంగా ఆకట్టుకున్న సంగీత అవధాన
గేయధార

తిరుపతి, 2024 మే 21: వెంగమాంబ జయంతి ఉత్సవాల్లో భాగంగా సంగీత అవధాన గేయధార కార్యక్రమం పుర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం సాయంత్రం తరిగొండ వెంగమాంబ 294వ జయంతోత్సవాల్లో సంగీత అవధానాన్ని ఎస్‌విబిసి ఛైర్మన్‌ డాక్టర్‌ సాయికృష్ణ యాచేంద్ర అద్భుతంగా గేయధార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎస్‌కేయూ మాజీ విసి డాక్టర్ కుసుమ కుమారి అధ్యక్షత వహించగా, నిషిద్ధాక్షరిగా విద్వాన్ శ్రీ ఆముదాల మురళి, అప్రస్తుత ప్రసంగం శ్రీ హేమంత్ వ్యవహరించారు.

అనంతరం ప్రఖ్యాత గాయని శ్రీమతి శ్రీనిధి బృందం “జయ రామ హృదయేశా… జయ వేంకటేశా..”, తరిగొండ నరసింహ…..,మా నాథుడే ఓయమ్మా…. తదితర కీర్తనలను సుమధురంగా ఆలపించారు.

ఈ కార్యక్రమంలో శ్వేత మరియు వెంగమాంబ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ భూమన్ సుబ్రమణ్యం రెడ్డి, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.