GITA AKHANDA PARAYANAM HELD _ తిరుమలలో ఘనంగా భగవద్గీత అఖండ పారాయణం

TIRUMALA, 23 DECEMBER 2023: The Akhanda Bhagavat Gita Parayanam was held at Tirumala Nada Neerajanam on Saturday held on the occasion of Gita Jayanti.

Eminent scholars, Sri Kuppa Vishwanatha Sharma, Sri Seshacharyulu, Sri Maruti led the recitation of Shlokas.

The SVVU VC Sri Ranisadasiva Murty, Dharmagiri Principal Sri KSS Avadhani, vedic pundits, devotees participated.

Earlier, Vishnu Sahasranama Parayanam was held on the occasion of Vaikuntha Ekadasi.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా భగవద్గీత అఖండ పారాయణం

తిరుమల, 2023, డిసెంబరు 23: గీతాజయంతిని పురస్కరించుకుని తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం భగవద్గీత అఖండ పారాయణం జరిగింది. ప్రముఖ పండితులు శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ, శ్రీ శేషాచార్యులు, శ్రీ మారుతి ఆధ్వర్యంలో పండితులు భగవద్గీతలోని శ్లోకాలను పారాయణం చేశారు.

ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ కె ఎస్ ఎస్ అవధాని ఇతర పండితులు పాల్గొన్నారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అంతకుముందు విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.