GITA JAYANTHI ON DECEMBER 7 – JEO _ డిసెంబరు 7న గీతాజయంతి ఉత్సవం నిర్వహణపై జెఈవో సమీక్ష
Tirupati, 28 Nov. 19: In connection with Gita Jayanthi on December 7, TTD JEO instructed the concerned to gear up for the fete.
A review meeting was held at the conference hall of TTD Administrative building in Tirupati on Thursday.
The JEO said, TTD is mulling to render the slokas in Bhagavat Gita with nearly 10thousand students of its educational institutions on December 7 in SV High School Grounds between 4pm and 6pm. Apart from this several expert scholars will also deliver discourse on the importance of Gita Saram”, he added.
SVVU Vice-Chancellor Dr Sannidhanam Sudarshana Sharma, Estates Officer Sri Vijaya Saradhi, HDPP Secretary Dr Rajagopalachari, SVHVS Project Officer Dr Akella Vibhishana Sharma, Devasthanams Educational Officer Dr Ramana Prasad, Principals of various institutions were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బాలబాలికలకు, యువతకు గీతాసారాంశాన్ని తెలియజేసేందుకు టిటిడి విద్యాసంస్థలు, ప్రయివేటు విద్యాసంస్థలకు చెందిన దాదాపు 10 వేల మంది విద్యార్థులతో గీతాశ్లోకాల పఠనం చేయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్ మైదానంలో ఏర్పాట్లు చేపడతామన్నారు. డిసెంబరు 7న సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, ఈ సందర్భంగా ప్రముఖ పండితులు భగవద్గీతపై ఉపన్యసిస్తారని తెలియజేశారు. ఇందుకోసం టిటిడి విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను వేదిక వద్దకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు ధార్మిక సంస్థలను భాగస్వాములను చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, ఎస్టేట్ అధికారి శ్రీ విజయసారధి, టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, విద్యాశాఖాధికారి డా. రమణప్రసాద్, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ టిటిడి విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.