GIVE MORE PUBLICITY TO LOCAL TEMPLES OF TTD-JEO TIRUPATI_ టిటిడి స్థానిక ఆలయాలపై మరింత విస్తృత ప్రచారం: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati JEO Sri P Bhaskar instructed the officers concerned to give wide publicity to local temples of TTD so that more number of pilgrims visit these temples.

A review meeting was held in the chambers of Tirupati JEO in TTD administrative building in Tirupati on Wednesday.
Instructing the officers concerned, the JEO said, the most important amenities like toilets, drinking water, lighting, parking and prasadam distribution counters need to be set up in all local temples for the convenience of the visiting pilgrims.

“The legendary of these temples should be displayed in all five languages including Telugu, Tamil, Kannada, Hindi and English at Railway station, Bus station, Alipiri bus stand etc. for better information of the pilgrims along with the route maps”, he directed the concerned.

The website content on local temples should be more attractive. The details of various arjitha sevas and other festivals that are being performed in these temples should also be included in the website content”, he instructed.

Special Grade DyEO Sri Munirathnam Reddy, HDPP Secretary Sri Ramana Prasad, local temples DyEOs Sri Venkataiah, Smt Varalakshmi, Smt Jhansirani, Sri Subramanyam were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి స్థానిక ఆలయాలపై మరింత విస్తృత ప్రచారం: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018 ఆగష్టు 1: టిటిడి స్థానిక ఆలయాలపై భక్తులకు మరింత విస్తృత ప్రచారం నిర్వహించాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో బుధవారం స్థానిక ఆలయాలను మరింత మంది భక్తులు సందర్శించుకునే అంశంపై అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుపతి పరిసర ఆలయాల వద్ద స్థలపురాణం వివరాలను 5 భాషలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా, ప్రధాన సేవల వివరాలను తెలియజేసేలా ఆలయాల ముందు బోర్డులను, భక్తులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్‌, ప్రసాదం, లైటింగ్‌ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్‌, అలిపిరి బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ పరిసరాలలో ఆలయాల స్థల పురాణం, ఆలయాల దూరం తెలియజేసే రూట్‌ మ్యాప్‌, కరపత్రాలను తయారు చేసి భక్తులకు పంపిణీ చేయాలన్నారు. టిటిడి అనుబంధ ఆలయాల సేవలు, స్థలపురాణం తదితర ముఖ్యమైన అంశాలపై డాక్యుమెంటరీని రూపొందించి ఎస్వీబీసీలో ప్రసారం చేయాలని, సప్తగిరి మాసపత్రికలో ఆకర్షనీయమైన కథనాలు, ఆల్‌ ఇండియా రేడియోలో వ్యాఖ్యానాలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. టిటిడి వెబ్‌సైట్‌లో స్థానిక ఆలయాల గురించి సమగ్రంగా, భక్తులకు ఆకట్టుకునేలా సమాచారాన్ని జోడించాలన్నారు. ఆలయాలలో రోజువారి సంగీత కచేరిలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో టిటిడి ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీ మునిరత్నం రెడ్డి, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణప్రసాద్‌, డెప్యూటీ ఈవో(జనరల్‌) శ్రీమతి గౌతమి, స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవోలు శ్రీ వెంకటయ్య, శ్రీమతి వరలక్ష్మీ, శ్రీమతి ఝాన్సీరాణి, శ్రీ సుబ్రమణ్యం, ఆల్‌ఇండియా రేడియో తిరుపతి సంచాలకులు డా. నాగసూరి వేణుగోపాల్‌, దూరదర్శన్‌ ప్రోగ్రామ్‌ ఎడిటర్‌ శ్రీమతి పూంగోదై ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.