GIVE WIDE PUBLICITY TO DHARMA PRACHARA ACTIVITIES-EO_ సనాతన హైందవ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 3 November 2017: TTD EO Sri A K Singhal directed the officials concerned to give more publicity on TTD dharmic activities.

A review meeting with all projects of TTD and HDPP was held in chambers of TTD EO on friday evening along with Tirupati JEO Sri P Bhaskar.

The EO instructed the HDPP to inform the present day youth about the importance of festivals, traditions etc. SVBC should come out with animated series on puranas to attract the children”, he felt.

FACAO Sri Balaji and other officers of various projects were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సనాతన హైందవ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2017 నవంబరు 03: పిల్లలు, యువతలో సనాతన హైందవ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో శుక్రవారం ఆయన హిందూ ధర్మప్రచార పరిషత్‌, ఇతర ధార్మిక ప్రాజెక్టుల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నేటి యువతలో సనాతన హైందవ ధర్మం, మానవీయ, నైతిక విలువలు పెంచేందుకు చిన్న వయస్సులోనే వారికి సులభంగా ఆర్ధమయ్యేలా, చిరకాలం గుర్తుండేలా కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నేడు మన పిల్లలకు మన సంస్కృతి, సాంప్రదాయం, నాగరికతను మనం తెలియజేయక పోతే రాబోవు రోజులలో వారు వీటన్నింటిని మర్చి పోయే అవకాశం ఉందన్నారు. కావున ఎలాంటి కార్యక్రమాలు చేపడితే వారికి సులభంగా అర్థమవుతుందో, వాటిని గుర్తించి ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్ళాలని తద్వారా లక్షలాది మంది పిల్లలకు ధర్మం గురించి, విలువలు గురించి తెలిపేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.

హిందూ సాంప్రదాయంలోని అనేక పండుగలు చేసుకుంటున్నా, ఆధునిక యువతలో చాల మందికి పండుగల విశిష్టత, వాటి పరమార్థం, వాటిని ఎలా నిర్వహించాలో అవగాహన ఉండడం లేదని, అటువంటి పండుగల విశిష్టత తెలిపేందుకు ఎస్వీబిసి ద్వారా కార్యక్రమాలు రూపొందించి పండుగకు కొన్ని రోజుల ముందు నుండి వాటిని ప్రసారం చేయాలని సూచించారు. చిన్న పిల్లలను అకట్టుకునేల సనాతన ధర్మానికి సంబంధించి, పురాణ కథలకు సంబంధించి యానిమేషన్‌ వీడియోలను వివిధ బాషాలలో రూపొందించి, వాటిని టిటిడి వెబ్‌సైట్‌, ఎస్వీబిసి ద్వారా ప్రజలకు చూపించడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేెతిక పరిజ్ఞానంలో మార్పులు వస్తున్నాయని, ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థను ఉపయోగించుకుని ధర్మ ప్రచార కార్యక్రామాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈవో అధికారులను కోరారు. త్వరలో మరోసారి సమావేశం నిర్వహించి ధర్మ ప్రచారానికి సంబంధించి అవసరమైన సూచనలను తీసుకొని, భక్తులందరూ హర్షించేలా కార్యక్రమాల ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీబాలాజి, ఎస్వీబిసి సిఈవో శ్రీ నరసింహరావు, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీరామకృష్ణరెడ్డి, ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, ప్రచురణల ప్రత్యేకాధికారి శ్రీ ఆంజనేయులు, ట్రాన్స్‌పోర్టు జియం శ్రీ శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది