GIVE WIDE PUBLICITY TO TTD HDPP ACTIVITIES-JEO_ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 5 September 2017: The Tirupati JEO Sri P Bhaskar called up on the HDPP officials to give wide publicity to HDPP activities.

A review meeting was held in SVETA building in Tirupati on Tuesday with TTD Publications, Annamacharya Project, Kalyanotsavam Project etc.
The JEO directed the officials concerned to come out with an action plan to give training to Dharma Prachara members belonging to Chittoor, Nellore, Kadapa, Krishna, Vijayanagaram, Warangal and Mehaboobnagar districts in SVETA.

“Organise more number of Srinivasa Kalyanam in the SC, ST, BC areas and distribute the spiritual mini books printed by TTD to the locals”, he added.

HoDs of the concerned departments were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2017 సెప్టెంబరు 05: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు అన్నమాచార్య ప్రాజెక్ట్‌, పబ్లికేషన్‌ విభాగం, కల్యాణోత్సవం ప్రాజెక్టు అధికారులతో మంగళవారం ఉదయం తిరుపతిలోని శ్వేత భవనంలో గల వెంగమాంబ సమావేశ మందిరంలో జెఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ ధర్మప్రచార పరిషత్‌ కార్యక్రమాలను మరింత బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన 7 జిల్లాలైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు, కడప, కృష్ణా, విజయనగరం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల ధార్మిక మండళ్ల సభ్యులకు శ్వేత భవనంలో శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణోత్సవాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. టిటిడి ముద్రించిన శ్లోకాలు, గోవిందనామాలు, శుభప్రదం, వేదపారాయణం, రామాయణ సందేశాలు, విష్ణు సహస్త్రనామాల పుస్తకాలను ఆయా గ్రామాల భక్తులకు చేరవేయాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీ ధనుంజయులు, శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకర్‌రావు, శ్వేత ఓఎస్‌డి శ్రీమతి చెంచులక్ష్మీ, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, హిచ్‌డిపిపి, శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది