GLORIOUS RECITATION OF SRI KRISHNA SHLOKAS – హరినామ స్మరణతో మార్మోగిన సప్తగిరులు – వైభవంగా శ్రీకృష్ణ శ్లోక పారాయణం

Tirumala, 06 September 2023: In celebration of Sri Krishna Janmashtami, Saptagiris echoed with the recitation of Sri Krishna Shlokas held on Wednesday evening at Nada Nirajanam stage in Tirumala.

 

A total of 97 shlokas from Dasama Skanda of Srimad Bhagavatam in chapters two and three were recited with great devotion by devotees.

 

Sanskrit scholar Sri Kuppa Vishwanatha Sharma of the National Sanskrit University from Tirupati narrated the birth story of Sri Krishna.

 

Dharmagiri Veda Vignana Peetham Pandits Sri Seshacharyulu and Sri Maruti recited the Shlokas.

 

SVBC broadcasted the live program from 6 pm to 7.30 pm for the sake of devotees all over the world.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హరినామ స్మరణతో మార్మోగిన సప్తగిరులు

– వైభవంగా శ్రీకృష్ణ శ్లోక పారాయణం

 తిరుమల, 2023 సెప్టెంబరు 06 ; శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల నాద నిరాజనం వేదికపై బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ కృష్ణ శ్లోక పారాయణంతో సప్తగిరులు మార్మోగాయి. శ్రీమద్ భాగవతం దశమ స్కందంలోని రెండు, మూడు అధ్యాయాల్లోని 97 శ్లోకాలను ఎంత భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు.

తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రవచన కర్త శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ శ్రీకృష్ణ జన్మ వృత్తాంతాన్ని వివరించారు.

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు శ్రీ శేషాచార్యులు, శ్రీ మారుతి శ్లోక పారాయణం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.