GODA DEVI GARLANDS FROM SRIVILLIPUTTUR FOR LORD VENKATESWARA_ తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు
Tirumala, 26 September 2017: The traditional presentation of Godadevi garlands from Srivilliputtur arrived at Srivari temple this afternoon.They were received by the TTD EO Sri Anil Kumar Singhal at the Bedi Anjaneyaswami temple. The garlands were first brought to Sri Pedda Jeeyangar mutt and offered pujas by both Sri Pedda Jeeyangar and Sri Chinna Jeeyar before handing it over to the TTD.
Speaking on the occasion, TTD EO said said the Goda garlands would be main decorative items of the Garuda Vahanams. The garlands were taken out in procession on the four mada streets by mangala vadhyams before they were escorted into the Srivari temple.
Among others who participated were DyEO Sri Koddandarama Rao and Peishkar Sri Ramesh Babu.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు
సెప్టెంబర్ 26, తిరుమల 2017: శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు మంగళవారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల శ్రీపెద్దజీయంగార్ మఠానికి మాలలను తీసుకొచ్చారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. అక్కడ శ్రీశ్రీశ్రీపెద్దజీయంగార్, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేదని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించినట్టు చెప్పారు. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని తెలియజేశారు.
శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద నుండి మంగళవాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడవీధుల గుండా ఊరేగింపుగా గోదాదేవిమాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, పేష్కార్ శ్రీరమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.