GODA KALYANAM ON JANUARY 15 _ జనవరి 15న టీటీడీ పరిపాలనా భవనంలో గోదా కల్యాణం

Tirupati, 14 January 2024: Sri Goda Kalyanam will be held on Monday evening, January 15, the day after Dhanurmasam.

The religious event will take place in the Parade Grounds of the TTD Administration building in Tirupati. 

This program will be observed between 6.30 pm to 8.30 pm and will be telecasted live by SVBC.

The Utsava Murthies of Sri Krishnaswamy and Sri Andal Goda Devi are specially decorated and the Archaka will perform the celestial Kalyanam.

The students of SV College of Music and Dance will present the Goda Kalyanam dance.

Finally the program ends with Govindanama Sankeertanam. 

Devotees shall participate in this divine event and beget the blessings of Swamy and Ammavaru.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 15న టీటీడీ పరిపాలనా భవనంలో గోదా కల్యాణం

తిరుపతి, 2024 జనవరి 14: ధనుర్మాసం ముగిసిన మరుసటి రోజైన జనవరి 15వ తేదీ సోమవారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో గోదా కల్యాణం జరగనుంది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు వేడుకగా కల్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో గోదా కల్యాణం నృత్యరూపకం ప్రదర్శిస్తారు. చివరగా గోవిందనామ సంకీర్తనతో కార్యక్రమం ముగుస్తుంది. భక్తులు ఈ కల్యాణంలో పాల్గొని స్వామి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.