PARVETA UTSAVAM AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం

Tirupati,17 January 2024: TTD  organised the annual fete of Parveta Utsavam at Sri Govindaraja Swamy temple on Wednesday.

 

As part of the festivities, the Utsava idols of Sri Govindaraja Swamy, Sri Devi and Bhudevi, Sri Andal ammavaru participated in Asthanam at Parveta Mandapam located in Renigunta Road in the evening and after ceremony the utsava idols returned to the temple. 

 

A mock hunt was enacted on the occasion which enthralled the devotees who assembled to witness the unique festival.

 

HH Tirumala Sri Pedda Jeeyar Swamy, JEO Sri Veerabrahmam, FACAO Sri Balaji, DyEO Smt Shanti AEO Sri Munikrishna Reddy, Superintendent Sri Mohan Rao and others participated.

 

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం
 
తిరుపతి, 2024 జనవరి 17: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
 
ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆస్థానం నిర్వహించారు.  స్వామివారి వేటను తిలకించడానికి పారువేట మండపానికి విశేష సంఖ్య‌లో భక్తులు విచ్చేసారు. తిరిగి నగరవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను సాయంత్రం 6.30 గంటలకు ఆలయానికి తీసుకువచ్చారు. 
 
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజీ, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ మోహన్ రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ధనంజయ పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.