GODA PARINAYOTSAVAM HELD AT SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా గోదా ప‌రిణ‌యోత్స‌వం

Tirupati,16 January 2024: TTD  organised the annual fete of Sri Goda Parinayotsavam at Sri Govindaraja Swamy temple on Tuesday.

 

As part of the festivities, the Parinayotsavam of Sri Goda Devi and Sri Krishna Swamy was observed at Sri Pundarikavalli temple in the evening.

     

DyEO Smt Shanti AEO Sri Munikrishna Reddy, Superintendent Sri Mohan Rao and temple inspector Sri Dhananjay were present.

 

PARVETA UTSAVAM ON JAN 17

 

The Parveta Utsavam in Sri Govindaraja temple will be observed on January 17. The utsava idols of Sri Govindaraja Swamy, Sri Devi and Bhudevi, Sri Andal ammavaru will participate in Asthanam at Parveta Mandapam at Renigunta Road in the evening and after ceremony, the utsava idols return to the temple.

 

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా గోదా ప‌రిణ‌యోత్స‌వం

తిరుపతి, 2024 జనవరి 16: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం గోదా ప‌రిణ‌యోత్స‌వం ఘనంగా నిర్వహించారు. ‌ఇందులో భాగంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

సాయంత్రం 4 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యంవ‌ద్ద శ్రీకృష్ణ స్వామి వారికి, గోదాదేవి అమ్మవారికి ప‌రిణ‌యోత్స‌వం నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ ఇతర అధికారులు పాల్గొన్నారు.

జనవరి 17న పార్వేట ఉత్సవం

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 17న పార్వేట ఉత్స‌వం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారిని రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం నిర్వ‌హించి తిరిగి ఆల‌యానికి ఊరేగింపుగా చేరుకుంటారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.