GODAVARI HARATHI TO BE HELD AT GOSHPADA KSHETRAM ON NOVEMBER 16 _ నవంబర్ 16న గోష్పాద క్షేత్రంలో ఘనంగా గోదావరి హారతి
TTD, DASA SAHITYA PROJECT AND WEST GODAVARI DISTRICT ADMINISTRATION TO JOINTLY ORGANISE THE EVENT
Tirupati, September 3, 2026: TTD JEO (Health and Education) Sri Prabhala Gopinath unveiled the poster for Godavari Harathi at the SVETA meeting hall on Saturday.
The programme will be jointly organised by TTD, Dasa Sahitya Project and the West Godavari district administration, with the processional deities of Sri Venkateswara Swamy along with Sridevi and Bhudevi.
The harathi will be performed at Goshpada Kshetram near Kovvur in West Godavari district from 4.30 pm to 7.30 pm on November 16, conveying a spiritual message on the protection and preservation of water resources.
TTD JEO invited devotees to participate in the sacred event and seek the blessings of Godavari Matha and Sri Venkateswara Swamy.
Dasa Sahitya Project Special Officer Sri Ananda Teerthacharyulu, HDPP Dr. Medasani Mohan, SVETA In-charge Director Dr. Vema Venkata Ratnam and other officials participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
నవంబర్ 16న గోష్పాద క్షేత్రంలో ఘనంగా గోదావరి హారతి
టిటిడి–దాససాహిత్య ప్రాజెక్ట్–పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం
గోదావరి నదికి పూజలు, హారతులతో జలసంపద పరిరక్షణకు ఆధ్యాత్మిక సందేశం
తిరుపతి, 2026, సెప్టెంబర్ 03: గోదావరి నదికి ఆధ్యాత్మిక సంప్రదాయబద్ధంగా హారతి సమర్పించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను టిటిడి జేఈవో (వైద్యం, విద్య) శ్రీ ప్రభల గోపినాథ్ శనివారం ఉదయం టిటిడి శ్వేత సమావేశ మందిరంలో ఆవిష్కరించారు.
టిటిడి, దాససాహిత్య ప్రాజెక్ట్, పశ్చిమ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులతో ఈ గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా జేఈవో శ్రీ ప్రభల గోపినాథ్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో నదులను జీవనదాతలుగా, దైవస్వరూపాలుగా భావించి వాటికి పూజలు, హారతులు సమర్పించే సంప్రదాయం అనాదిగా కొనసాగుతోందని తెలిపారు. నదీ దేవతకు దీపారాధన, హారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, నదులు పుష్కలంగా ప్రవహించి సమస్త జీవరాశులకు జీవనాధారంగా నిలవాలని ప్రార్థించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
నవంబర్ 16న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని గోష్పాద క్షేత్రంలో సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు గోదావరి హారతి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు జేఈవో వెల్లడించారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోదావరి మాత ఆశీస్సులతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో దాససాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ డా. మేడసాని మోహన్, శ్వేత ఇన్‌ఛార్జి సంచాలకులు డా. వేమా వేంకట రత్నం, డిపిపి అదనపు కార్యదర్శి శ్రీమతి కళ్యాణి, డిపిపి ఏఈవో శ్రీ సిహెచ్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

