GODDESS AS CHAITANYA SWAROOPUNI TAKES RIDE ON GARUDA VAHANAM_ గరుడ వాహనంపై చైతన్యస్వరూపిణి
Tiruchanur, 20 November 2017: After the Gaja Vahana Seva on fifth day evening, Goddess Padmavathi took celestial ride on Garuda Vahanam on Monday evening.
The Lakshmi Kasula Haram which was adorned to Gajavahanam was also decorated to Garuda Vahanam. The golden Padukalu was also decked as a symbolic presence of Lord during Garuda Vahana seva.
All the streets were abuzz with devout activity to catch tge glimpse of Goddess on Garuda Vahana, tge favorite carrier of Her Lord
TTD EO Anil Kumar Singhal, JEO Tirupati Sri P Bhaskar, Spl Gr DyEO Sri Muniratnam Reddy, CVSO Sri Ake Ravikrishna, ACVSO Sri Sivakumar Reddy and others were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
గరుడ వాహనంపై చైతన్యస్వరూపిణి
తిరుపతి, 2017 నవంబరు 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం రాత్రి గరుడసేవ వైభవంగా జరిగింది.
రాత్రి 8.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనం పై దర్శనమిచ్చారు. గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా సంప్రదాయజ్ఞులు సన్నుతిస్తున్నారు. శ్రీవారినీ, అమ్మవారినీ నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా ఇంకా పలు విధాలుగా సేవిస్తున్నారు. గరుడపచ్చను వక్షఃస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా జీవాంతరాత్మకుడై చిన్మయుడై నిజసుఖాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షసుఖం కరతలామలకం అవుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.