GODDESS CHARMS IN UNIQUE VAIKUNTHANATHA AVATARA _ పెద్దశేష వాహనంపై వైకుంఠ‌నాథుని అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి

Tiruchanoor, 12 Nov. 20: On the day two of ongoing annual karthika brahmotsavams at Tiruchanoor on Thursday, the Goddess charmed devotees in the unique “Vaikunthanatha” avatara on Pedda Sesha Vahanam.

The Goddess appeared on the seven hooded mighty serpent vahana as Seshasayani in a resting pose, holding Conch and Disc in her hands between 8am and 9am.

In this vahana seva which was held in Ekanta, HH Sri Pedda Jiyar Swamy, HH Sri Chinna Jiyar Swamy, JEO Sri P Basnth Kumar, CE Sri Ramesh Reddy, DyEO Smt Jhansi Rani and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పెద్దశేష వాహనంపై వైకుంఠ‌నాథుని అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి
 
తిరుపతి, 2020 న‌వంబ‌రు 12: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠ‌నాథుని(శ్రీ మహావిష్ణువు) అలంకారంలో శంకుచ‌క్రాలు, గ‌దతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
 
శ్రీ పద్మావతి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవ దర్శనం వల్ల యోగశక్తి కలుగుతుంది.
 
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ కుమార్, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, విఐలు శ్రీ సురేష్ రెడ్డి, శ్రీ మహేష్, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.