GODDESS PLEASES DEVOTEES AS “GOKULA KRISHNA ” _ కల్పవృక్ష వాహనంపై గోకులంలో కృష్ణుని అలంకారంలో శ్రీ పద్మావతి

Tiruchanoor, 14 Nov. 20: On the fourth day morning on Saturday as part of ongoing Karthika Brahmotsavams, Goddess Sri Padmavathi Devi blessed devotees as Gokula Krishna on Kalpavruksha Vahanam.

Since the day one of annual Karthika Brahmotsavams, Goddess Sri Padmavathi Devi has been charming devotees virtually in different guises of lord Krishna. 

In this vahana seva which was held in Ekanta, HH Sri Pedda Jiyar Swamy, HH Sri Chinna Jiyar Swamy, JEO Sri P Basnth Kumar, CE Sri Ramesh Reddy, DyEO Smt Jhansi Rani, VGO Sri Bali Reddy, AEO Sri Subramanyam and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కల్పవృక్ష వాహనంపై గోకులంలో కృష్ణుని అలంకారంలో శ్రీ పద్మావతి
 
తిరుపతి, 2020 న‌వంబ‌రు 14: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై  గోకులంలో కృష్ణుని అలంకారంలో అలంకారంలో ఆవు, దూడతో అమ్మవారు  దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
 
పాలకడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలిదప్పుల్ని తొలగించి, పూర్వజన్మస్మరణను ప్రసాదించే ఈ ఉదారదేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తి.
 
వాహనసేవలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ కుమార్, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, విఐలు శ్రీ సురేష్ రెడ్డి, శ్రీ మహేష్, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.