ALL SET FOR KRISHNASTAMI _ టిటిడి స్థానిక ఆలయాలలో ఆగస్టు 23న గోకులాష్టమి వేడుకలు

Tirupati, 21 August 2019: TTD plans to conduct Gokulashtami in a grand manner on August 23rd in all it’s local temples at Tiruchanoor, Kapilateertham, Narayanavanam, Karvetinagaram, Nagulapuram.

The TTD has made elaborate arrangements for conduction of festival of Utlotsavam on August 24th at all these local temples.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి స్థానిక ఆలయాలలో ఆగస్టు 23న గోకులాష్టమి వేడుకలు

తిరుపతి, 2019 ఆగస్టు 21: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీ కృష్ణ స్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, నారాయణవనం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయం, కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయాలలో ఆగస్టు 23వ తేదీ శుక్రవారం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. అదేవిధంగా ఆగష్టు 24వ తేదీ ఉట్లోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తిరుచానూరులోని శ్రీ కృష్ణ స్వామివారి ఆలయంలో

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీ కృష్ణ స్వామివారి ఆలయంలో ఆగస్టు 23వ తేదీన గోకులాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటిరోజు గోకులాష్టమి ఆస్థానం, రెండో రోజు ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.

గోకులాష్టమి రోజైన శుక్రవారం ఉదయం శ్రీ కృష్ణ స్వామి మూలవర్లకు అభిషేకం,అర్చనలు మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6.45 నుండి రాత్రి 8.00 గంట వరకు స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. అదేవిధంగా ఆగస్టు 24న శనివారం సాయంత్రం 6.00 నుండి 7.30 గంటల వరకు ఉట్లోత్సవం, ఆస్థానం వైభవంగా జరుగనుంది.

తిరుపతిలోని కపిలితీర్ధం వద్ద వున్న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామివారి వీధి ఉత్సవం, రాత్రి 8.00 నుండి 8.30 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.

నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో

నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, శుద్ది నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 నుండి 6.45 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన చేయనున్నారు.

ఆగష్టు 24వ తేదీ శనివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం చేయనున్నారు. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి వీధి ఉత్సవం, ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, శుద్ది నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన చేయనున్నారు.

ఆగష్టు 24వ తేదీ శనివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం చేయనున్నారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామివారి వీధి ఉత్సవం, ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు, ఉత్ససర్లకు తిరుమంజనం చేయనున్నారు. సాయంత్రం 5.30 నుండి 6.00 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.

శనివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమల, కొలువు, పంచాంగ శ్రవణం, నిర్వహించనున్నారు. సాయంత్రం 5.00 నుండి 7.30 గంటల వరకు గో పూజ మహోత్సవం, ఉట్లోత్సవం, తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఈ రెండు రోజుల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.