SWARNARATHAM GLIDES ALONG MADA STREETS_ స్వర్ణరథంపై దేవదేవుడి విహారం

DEVOTEES HAD A TRIPLE DELIGHT ON SUNDAY

Srinivasa Mangapuram, 11 February 2018: The devotees had a triple delight on Sunday when they witnessed lord kalyana Venkateswara swamy took celestial ride on three different vahanams.

The Lord initially in the morning took ride on Hanumantha vahanam and in the night on Gaja vahanam while in mid of the day He took celestial ride on golden chariot along with his two consorts Sridevi and Bhudevi.

The happiness of devotees knew no bounds when they had rare glimpse of Lord on three different vahanams on a single day itself.

DyEO Sri Venkataiah, AEO Sri Srinivasulu, Exe Engineer Sri Manohar, DyEE Sri Ramamurthy, Chief kankana bhattar Sri Balaji Rangacharyulu, AE Sri Nagaraju, AVSO Sri Ganga Raju and others participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

స్వర్ణరథంపై దేవదేవుడి విహారం

తిరుపతి, 2018, ఫిబ్రవరి 11: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం సాయంత్రం 5.00 నుండి రాత్రి 6.00 గంటల వరకు రథరంగ డోలోత్సవం కన్నులపండుగగా జరుగనుంది. శ్రీనివాసుడు ధగధగా మెరిసిపోతున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించాడు.

శ్రీవారికి శ్రీభూదేవులు ఇరుప్రక్కలా ఉంటారు. శ్రీదేవి(లక్ష్మి) బంగారుకాగా – ఆమెను భరించే స్వామికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందం. బంగారం శరీరాన్ని తాకుతుంటే శరీరంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. బంగారం మహాశక్తిమంతమైన లోహం. స్వామివారికి కృష్ణావతారంలో దారుకుడు సారథి, కాగా శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనేవి నాల్గుగుర్రాలు. శ్రీవారి ఇల్లు, ఇల్లాలు బంగారం, ఇంట పాత్రలు బంగారం. సింహాసనం బంగామే. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది.

‘స్వర్ణ’ మంటే ‘బాగా ప్రకాశించేది’ అని వ్యుత్పత్తి. స్వర్ణం లభించేది భూమినుండే. కనుక ఇరువైపులా శ్రీదేవి, భూదేవీ ఉండగా శ్రీవారుమధ్యలో ఉండి, స్వర్ణరథంలో ఊరేగడం – స్వామివారి మహోన్నతినీ, సార్వభౌమత్వాన్నీ, శ్రీసతిత్వాన్నీ, భూదేవీనాథత్వాన్నీ సూచిస్తూంది.

ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో బంగారు, మణులు, సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.