GOLDEN UMBRELLA EVENT HELD_ బ్రహ్మోత్సవాల సందర్భంగా బంగారు గొడుగు ఉత్సవం
Tirumala, September 19: Golden umbrella festival was celebrated at Tirumala ahead of the magnificent Rathotsavam event on September 20, the penultimate day of ongoing Brahmotsavams.
As per temple legend, Srinivasa Mahadeva Raya, a descendant of Sri Krishnadevaraya, the family of Pantulu holds the privilege since centuries.
What started off in the initial days with a tribal umbrella transformed into a Golden one from 1952 onwards. The descendants of the Pantulu family have been presenting such Golden Umbrellas to other temples like Sri Govindaraja temple, Sri Kodandrama temple and the Sri Padmavathi Ammavari Temple also.
TTD EO Sri Anil Kumar Singhal and Tirumala JEO Sri KS Sreenivasa Raju were given Purnakumbha Swagatham by Pantulu Ramanathan, a descendant of the family.
Kalyana Katta DyEO Smt Nagaratna took part in this fete.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTD, TIRUPATI
బ్రహ్మోత్సవాల సందర్భంగా బంగారు గొడుగు ఉత్సవం
తిరుమల, 2018 సెప్టెంబరు 19: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం బుధవారం సాయంత్రం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబరు 20వ తేదీ శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకొని ముందురోజు సాయంత్రం కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందని తెలిపారు. చారిత్రక నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు కాలంలో కాలంలో చంద్రగిరిరాజు శ్రీనివాసమహదేవరాయలు చేసిన ధర్మ శాసనం ప్రకారం పంతులుగారి వంశస్థులు ఈ హక్కును కొన్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారని తెలిపారు. తొలిరోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై, ఆటు తరువాత 1952 నుండి రథానికి బంగారు గొడుగు సమర్పించడం జరుగుతున్నదన్నారు.
అంతకుముందు కల్యాణకట్ట వద్ద ఈవో, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుకు పూర్ణకుంభం స్వాగతం పలికారు. అనంతరం బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి రథానికి సమర్పించారు.
కాగా పంతులుగారి ప్రస్తుత వంశీకుడైన పంతులుగారి శ్రీ రామనాథన్ ఆధ్వర్యంలో కల్యాణకట్ట క్షురకులు, సిబ్బంది, సభ్యులు ఈ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, కల్యాణకట్ట డెప్యూటి ఈవో శ్రీమతి నాగరత్న, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.