GOLDEN UMBRELLA FEST OBSERVED_ బ్రహ్మోత్సవాల సందర్భంగా బంగారు గొడుగు ఉత్సవం

Tirumala, 29 September 2017: As part of the ongoing Brahmotsavam, the Golden Umbrella festival celebrated at Tirumala on Friday.

As part of the age old custom, the staff of the Kalyana Katta (barbers) ceremonially install a brand new Golden Umbrella ahead of the prestigious and auspicious Rathotsavam event at Tirumala that is going to be observed on Saturdaymorning.

The descendants of the Pantulugari family have been presenting the Golden Umbrella to Lord Venkateswara from the past five centuries. In the initial days it was made of wood. But since 1952 onwards, wooden Umbrella is replaced with Golden Umbrella.

Sri Panthulugari Ramanathan, descendant of the Pantulu family presented the umbrellas at a ceremony on Fridayevening which was also attended by TTD EO Sri AK Singhal, JEO Sri KS Sreenivasa Raju and CVSO Sri A Ravikrishna.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

బ్రహ్మోత్సవాల సందర్భంగా బంగారు గొడుగు ఉత్సవం

తిరుమల, 2017 సెప్టెంబరు 29: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం శుక్రవారం సాయంత్రం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. సెప్టెంబరు 30వ తేదీ శనివారం శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకొని అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం మేరకు ముందురోజు సాయంత్రం శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు.

చారిత్రక నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు కాలంలో చంద్రగిరిరాజు శ్రీనివాసమహదేవరాయలు చేసిన ధర్మ శాసనం ప్రకారం పంతులుగారి వంశస్థులు ఈ హక్కును కొన్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు. తొలిరోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై, ఆటు తరువాత 1952 నుండి రథానికి బంగారు గొడుగు సమర్పించడం జరుగుతున్నది.

కాగా పంతులుగారి ప్రస్తుత వంశీకుడైన పంతులుగారి శ్రీ రామనాథన్‌ ఆధ్వర్యంలో కల్యాణకట్ట క్షురకులు, సిబ్బంది, సభ్యులు ఈ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం తిరుమలలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి కార్యనిర్వణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, కల్యాణకట్ట డిప్యూటి ఈవో శ్రీవెంకటయ్య, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.