“GOVINDA” IN GO SAMRAKSHANA _ గో ర‌క్ష‌ణ‌లో గోవిందుడు

COMPREHENSIVE PLANS BY TTD FOR GOSHALA DEVELOPMENT IN TELEGU STATES

 

UNPRODUCTIVE COWS AND BULLOCKS TO BE DONATED TO PROMOTE ORGANIC FARMING

 

SO FAR 2000 COWS AND BULLOCKS DONATED FREELY TO ORGANIC FARMERS

 

Tirumala, 12 September 2022: The bond between Sri Venkateswara and Cow is so significant that even the Lord of Seven Hills is fondly called “Govinda”-the protector of Cows. Keeping the anecdote live, TTD in the last three years, has taken up various Gosamrakshana activities which have occupied top position in its list of many other socio-religious activities of the recent times. Besides developing the Gosalas at Tirupati, Tirumala and Palamaner, TTD has launched a program on encouraging desi cow breeds by taking up numerous unique Gosamrakshana activities.

 

A peep into the series of Gau related activities by TTD:

 

GUDIKO GOMATA

 

TTD launched the “Gudiko Gomata” campaign with divine slogan that Worship of Gomata is equivalent to worshipping all the deities of the Hindu Sanatana Dharma. To spread the significance of Gopuja, TTD promoted Go puja at all temples by donating a pair of cow and calf. TTD Chairman Sri YV Subba Reddy launched the program on December 7, 2020 by donating a cow and a calf to Sri Kanaka Durga temple at Vijayawada as part of holy Karthika month activities.

 

TTD has so far donated a pair of cow and a calf to 197 temples in the states of AP, Telangana, Karnataka, Delhi and Tamilnadu. TTD has conceived an action plan to provide a pair of cow and calf to temples, Peethas, and Veda pathasalas that come forward to promote Gosamrakshana and Go puja across the country. Several donors have responded to TTD appeal for donation of desi breed to TTD Gosamrakshanasala.

 

Saptagiri Gopradakshina Mandiram at Alipiri

 

As part of its drive to promote significance of Go puja, TTD also set up a Gomandiram at Alipiri on donation of ₹15 crore. The complex provided facilities for devotees to perform Go puja and donate through “Gau Tulabaram” to provide fodder and grass for the maintenance of cows at Goshalas. The Complex also comprised of a gallery highlighting the concept of Gosamrakshana and all the desi breeds of bovines.

 

GOVINDUNIKI GO ADHARITA NAIVEDYAM

 

Among the various unique activities taken up by TTD in the last two and a half years, the most impressive programme is “Govinduni Go Adharita Naivedyam” – preparing the daily offerings of various delicacies to the presiding of Sri Venkateswara Swamy in Tirumala temple with Cow based Organic Farming produce which commenced in May last. The Annaprasada Naivedyams including Chakkara pongali (Jaggery Pongal), Pongal, Curd Rice, Malahora (Pepper rice), Daddyodanam (Curd rice), Pulihora (tamarind rice), Kadambam (mixed vegetable rice) etc. are being prepared out of Go Adharita products with enhanced taste.

 

TTD has also given a clarion call to the natural farmers that it is ready to purchase their produce through Mark Fed if they come forward and cultivate organic produce and vegetables in their agri fields by using natural farming techniques.

 

Development of Indigenous breeds of bovines

 

TTD has appointed experts in the respective field as Gosamrakshana Trust members in order to promote its Goshalas at Palamner, Tirupati and Tirumala. In coordination with SV Veterinary University, TTD has commenced a program for evolving Desi breed of cows and its protection in TTD Gosalas which include Embryo Transfer to increase the milk produce. TTD is also setting up a feed mixing plant which will come into operation by January next.

 

Financial support to Goshala in Telugu states

 

TTD has decided to coordinate activity with the 516 Goshalas in Telugu states for promoting desi breed cows, maintenance through financial assistance on merit. As part of the movement TTD has donated 2000 barren cows and bullocks to farmers so far who are engaged in producing organic products in their fields by using cow dung from these animals as a manure.

 

TTD has so far donated 2000 non-milking bovines to organic farmers who resisted use of pesticides and fertilisers in their agri lands. This programme has been kick started in both Telugu states. Besides TTD is also lending financial support to Goshalas.

 

TTD has also set up an experts committee for purchase from of milch bovines useful for breeding. The Committee toured Northern states and bought several high milk yielding animals for breeding at SV Goshala.

 

TTD has also launched a program for supporting the Goshala maintenance in Telugu states by setting up two Nodal Gosalas in each district. The operators of 32 nodal Gosalas were recently given a two-day training at SVETA Bhavan. TTD has also appealed to the Gosalas operators to hand over animals which they could not maintain, so that they can be donated to organic farmers.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గో ర‌క్ష‌ణ‌లో గోవిందుడు

– తెలుగు రాష్ట్రాల్లో గోశాల‌ల అభివృద్ధికి బృహ‌త్ ప్ర‌ణాళిక‌

– పాలివ్వ‌ని ఆవులు, ఎద్దుల‌ను ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి మళ్లింపు

– 2 వేల ఆవులు, ఎద్దులు ఉచితంగా రైతుల‌కు అప్ప‌గింత


తిరుమల 12 సెప్టెంబరు 2022: “అల‌నాటి ఆల‌మంద‌లే నిజ‌మైన శ్రీ‌వారి సంప‌ద” అని విశ్వ‌సిస్తూ గో ప్రాముఖ్య‌త‌ను ప్ర‌పంచం న‌లుమూల‌లా వ్యాపింప‌చేయ‌డానికి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం గ‌త మూడేళ్లుగా గో సంరక్ష‌ణ‌కు పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా తిరుప‌తి, ప‌ల‌మ‌నేరు, తిరుమ‌ల గోశాల‌ల‌ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయ‌డంతో పాటు, దేశ‌వాళీ గో సంత‌తి ప‌రిర‌క్ష‌ణ‌కు, గో సంర‌క్ష‌ణ‌ కార్యాచ‌ర‌ణ‌కు రంగంలోకి దిగింది. పాలివ్వ‌ని ఆవులతో పాటు ఎద్దుల‌ను ప్ర‌కృతి వ్య‌వ‌సాయం దిశ‌గా మళ్లించింది. ర‌సాయ‌నిక ఎరువులు, పురుగు మందులు ఉప‌యోగించ‌కుండా వ్య‌వ‌సాయం చేసే రైతుల‌కు రెండు వేల ఆవులు, ఎద్దుల‌ను ఉచితంగా అంద‌చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని గోశాల‌ల‌ను టిటిడి గోశాల‌తో అనుసంధానం చేసే కార్యక్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది.

నిత్య‌గోపూజ

గోసంర‌క్ష‌ణ‌లో భాగంగా గోమాత విశిష్ట‌త‌ను తెలియ‌జేసే దిశ‌గా తిరుమ‌ల, తిరుప‌తితోపాటు ఇత‌ర ఆల‌యాల్లో నిత్యం గోపూజ నిర్వ‌హించేలా టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది.

గుడికో గోమాత

గోవును పూజిస్తే ముక్కోటి దేవ‌త‌ల‌ను పూజించిన‌ట్లే అనే నినాదంతో టిటిడి గుడికో గోమాత కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. గోసంర‌క్ష‌ణతోపాటు గోమాత విశిష్ట‌త‌ను, హిందూ ధ‌ర్మంలో గోమాత‌కు ఉన్న ప్రాశస్త్యాన్ని దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం చేయ‌డానికి, దేశంలోని ప్ర‌ముఖ ఆల‌యాల‌న్నింటిలో భ‌క్తుల‌కు గోపూజ‌ను అందుబాటులోకి తీసుకురావ‌డానికి 2020, డిసెంబరు 7వ తేదీ కార్తీక మాసం సంద‌ర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆల‌యానికి దేశీయ గోవు, దూడ అందించి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వివిధ ఆల‌యాల‌తోపాటు తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లోని 197 ఆల‌యాల‌కు ఆవు, దూడ అందించి ఆ రాష్ట్రాల్లో టిటిడి గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలోని ఆలయాలు, పీఠాలు, వేద పాఠశాలలు ముందుకొస్తే గోవును, దూడ‌ను అందించి గోసంర‌క్ష‌ణ‌, గోపూజ కార్య‌క్ర‌మాల‌ను దేశ‌వ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్ల‌డానికి టిటిడి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇందుకోసం భ‌క్తులు దేశ‌వాళీ గోవులు, దూడ‌ల‌ను విరాళంగా అందించాల‌ని దాత‌ల‌కు టిటిడి పిలుపునిచ్చింది. ప‌లువురు దాత‌లు స్పందించి దేశ‌వాళీ గోవుల‌ను టిటిడి గోసంర‌క్ష‌ణ‌శాల‌కు అందిస్తున్నారు.

గోవిందుని ద‌ర్శ‌నానికి ముందుగా గోద‌ర్శ‌నం

స‌క‌ల‌దేవ‌తా స్వ‌రూపిణి అయిన గోమాత‌ను సేవిస్తే గోవిందుని పూజించిన‌ట్లే అనే సంక‌ల్పంతో గోవు ప్రాశ‌స్త్యాన్ని, ప్రాముఖ్య‌త‌ను భ‌క్తుల‌కు తెలియ‌జేసేలా తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద రూ.15 కోట్ల విరాళంతో స‌ప్త‌గోప్ర‌ద‌క్షిణ మందిరం నిర్మించారు. తిరుప‌తి నుంచి తిరుమ‌ల‌కు న‌డిచి వెళ్లే భ‌క్తులు, వాహ‌నాల్లో వెళ్లే భ‌క్తులు ముందుగా గోద‌ర్శ‌నం, గోపూజ చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. ఇక్క‌డ ఏర్పాటు చేసిన గో తులాభారం ద్వారా గోవుల పోష‌ణకు అవ‌స‌ర‌మ‌య్యే దాణ‌, ప‌శుగ్రాసం భ‌క్తులు విరాళంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

గోసంరక్షణశాలల అభివృద్ధి

టిటిడి ఆధ్వర్యంలోని తిరుమల, తిరుపతి, పలమనేరు గోశాలలను సంప్రదాయంగా, శాస్త్రీయంగా నిర్వహించడం కోసం నిష్ణాతులైన వారిని గోసంరక్షణ ట్రస్టు సభ్యులుగా నియమించుకుంది. గోశాలల్లో దేశీయ గోజాతుల సంతతి అభివృద్ధి, సంరక్షణకు చర్యలు చేపట్టింది. తిరుపతి ఎస్వీ పశు వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో పశువుల సంతాన ఉత్పత్తికి ఆధునిక పిండ మార్పిడి విధానాలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్ర‌త్యేకంగా పశువుల దాణా తయారీ ప్లాంట్ నిర్మించి జ‌న‌వ‌రి నుంచి ఇక్క‌డే ఉత్ప‌త్తి ప్రారంభించ‌డానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. శ్రీ‌వారి నిత్య‌కైంక‌ర్యాల‌కు అవ‌స‌ర‌మ‌య్యే దేశ‌వాళీ ఆవునెయ్యి త‌యారీ కేంద్రాన్ని త్వ‌రలోనే అందుబాటులోకి తీసుకువ‌చ్చే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ప‌ల‌మ‌నేరులో గోశాల‌లోని ప‌చ్చిక‌బ‌య‌ళ్ల‌ను అభివృద్ధిప‌రిచి ప‌శుగ్రాసం సాగును పెంచ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టింది.

గో ఆధారిత వ్య‌వ‌సాయానికి గోవుల పంపిణీ

తెలుగు రాష్ట్రాల్లోని 516 గోశాల‌ల‌ను టిటిడి గోసంర‌క్ష‌ణ‌శాల‌కు అనుసంధానం చేయాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. గోశాల‌ల్లో దేశ‌వాళీ ఆవుల సంత‌తిని పెంచ‌డం, వాటిని సంర‌క్షించ‌డం కోసం అర్హ‌త‌ల‌ను బ‌ట్టి ఆర్థిక‌సాయం చేయాల‌ని టిటిడి నిర్ణ‌యం తీసుకుంది. గోసంర‌క్ష‌ణ‌లో భాగంగా టిటిడి గోశాల‌ల్లో ఉన్న 2 వేల‌కు పైగా పాలివ్వ‌ని ఆవులతోపాటు ఎద్దులను రైతుల‌కు గోఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి ఉచితంగా అందించింది. జిల్లాకు రెండు నోడ‌ల్ గోశాల‌ల‌ను ఏర్పాటుచేసి త‌మ ప‌రిధిలోని ఇత‌ర గోశాల‌ల‌ నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మ‌య్యే స‌హ‌కారం అందించే ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు 32 నోడ‌ల్ గోశాల‌ల‌ను గుర్తించి వారికి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తోంది. త‌ద్వారా గోవులు క‌బేళాల‌కు త‌ర‌లిపోకుండా రైతుల సంర‌క్ష‌ణ‌లో ఉంటూ వ్య‌వ‌సాయానికి పాటుప‌డ‌డం ద్వారా భూమాత‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తోంది. తిరుప‌తిలోని శ్వేతలో నోడ‌ల్ గోశాల‌ల నిర్వాహ‌కుల‌కు రెండు రోజుల పాటు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. పోష‌ణ భార‌మైన గోవుల‌ను ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల‌కు త‌ర‌లించేందుకు త‌గిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వారికి వివ‌రించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది