GOVINDA KOTI BOOKS DISTRIBUTED _ టీటీడీ చైర్మన్ చే గోవింద కోటి పుస్తకాల పంపిణీ

TIRUPATI, 20 SEPTEMBER 2023: TTD Chairman Sri Bhumana Karunakar Reddyy on Wednesday endorsed Govinda Koti which the TTD board has recently announced the Govinda Nama Writing program to inculcate dedication and commitment for Sanatana Hindu Dharma among children and youth aged below 25 years.

Earlier he performed special pujas at the Govinda Koti Vinayaka statue which was erected at Vinayaka Sagar in Tirupati where he commenced the distribution of Govind Koti books. The huge statue of Ganesha has been designed in an appealing manner that the Ganapati Himself wrote the Govinda Koti. Later the TTD Board Chief prayed for the all-around development of Tirupati city with blessings of Sri Venkateswara Swami and Sri Ganapathi. 

Tirupati Mayor Dr Shirisha.Municipal Corporation Commissioner Smt Haritha and designer of Govinda Koti Vinayaka statue Sri Kishan and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

టీటీడీ చైర్మన్ చే గోవింద కోటి పుస్తకాల పంపిణీ

– వినాయక సాగర్ లో గోవింద కోటి వినాయకుడికి ప్రత్యేక పూజలు

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తొలి సమావేశంలోనే ప్రవేశ పెట్టిన గోవింద కోటి లిఖిత కార్యక్రమం ఆచరణలోకి తేవడానికి బుధవారం తొలి అడుగుపడింది.

వినాయక సాగర్ లో ఏర్పాటు చేసిన గోవింద కోటి వినాయకుడి సాక్షిగా శాసన సభ్యులు, టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి భక్తులకు గోవింద కోటి పుస్తకాలు పంపిణీ చేశారు. విఘ్నాలను హరించే వినాయకుడే గోవింద కోటి రాస్తున్నట్లుగా తయారు చేసిన విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంది. చైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి ముందుగా వినాయకుడి పూజలో పాల్గొన్నారు. విగ్రహం ఏర్పాటు చేసిన మండపం నలువైపులా గోవింద కోటి నామం రాయడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. వినాయకుడు ప్రజలందరికీ శుభం జయం కలిగించాలని,  శ్రీ వేంకటేశ్వర స్వామి,  శ్రీ వినాయకుడి ఆశీస్సులతో తిరుపతి నగరం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని శ్రీ కరుణాకర రెడ్డి ప్రార్థించారు.

నగర మేయర్ డాక్టర్ శిరీష, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి హరిత, గోవింద కోటి వినాయక విగ్రహ కాన్సెప్టర్ శ్రీ కిషన్ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది