GOVINDA KOTI BOOKS, LOCAL TEMPLE CALENDARS, BHAGAVAT GITA RELEASED _ శ్రీ భగవద్గీత, స్థానిక ఆలయాల క్యాలెండర్లు, గోవింద కోటి పుస్తకాలు ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్
TIRUMALA, 26 DECEMBER 023: TTD Trust Board Chairman Sri B Karunakara Reddy along with the TTD EO Sri AV Dharma Reddy and other board members, officials released Govinda Koti and Bhagavat Gita books besides local temple calendars printed by TTD for the first time.
After the Trust Board meeting at Annamaiah Bhavan in Tirumala on Tuesday, the TTD Board Chief released the Govinda Koti book, priced at Rs.111 containing 200 pages. Govinda Namams can be written 39,600 times in each book. To write 10,01,116 Govinda Namams, 26 books are required and to write Govinda Koti (Govinda Namams for one crore times) a total of 253 books are required. TTD has introduced this unique spiritual feat to encourage youth below the age of 25 years to inculcate the habit of writing the divine names as a part of its mission of taking forward Hindu Sanatana Dharma.
On successful completion of writing 10,01,116 Govinda Namams, that person will be provided with a Break Darshan facility by TTD. While for those who complete one crore Govinda Namams, TTD provides Break Darshan and accommodation to a total of five persons.
For the convenience of the children and youth, TTD has brought out one lakh copies of a 20-page Bhagavat Gita simplified version in five languages viz. Telugu, Tamil, Kannada, Hindi and English which will be distributed among the children and students.
For the first time, TTD has brought out 13 thousand copies of local temple calendars comprising of Mula Murti and Utsava Murthies belonging to Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta, Sri Veda Narayana Swamy temple at Nagulapuram, Sri Kalyana Venkateswara Swamy temple at Narayanavanam, Sri Venugopala Swamy temple at Karvetinagaram, Sri Kodanda Rama Swamy temple at Vontimitta. The Mula Virat calendars are priced at Rs.20 while that of processional deities at Rs.15.
TTD board members, JEOs participated in the calendar-released event.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ భగవద్గీత, స్థానిక ఆలయాల క్యాలెండర్లు, గోవింద కోటి పుస్తకాలు ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్
తిరుమల, 2023 డిసెంబరు 26: శ్రీ భగవద్గీత, స్థానిక ఆలయాల క్యాలెండర్లు, గోవింద కోటి పుస్తకాలను టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ బోర్డు మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో ఈ కార్యక్రమం జరిగింది.
సనాతన ధర్మం పట్ల, మానవీయ, నైతిక విలువల పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు సరళమైన భాషలో సులభంగా అర్ధమయ్యేలా 20 పేజీలతో కూడిన భగవద్గీతను లక్ష పుస్తకాలను టీటీడీ ముద్రించింది. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 20 వేల పుస్తకాల వంతున ముద్రించిన భగవద్గీతను ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులకు ఉచితంగా అందివ్వనున్నారు.
టీటీడీ స్థానిక ఆలయాలైన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి, నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, నాగలాపురం శ్రీ వేద నారాయణస్వామి, కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి మూలమూర్తులు, ఉత్సవమూర్తులతో కూడిన 13 వేల క్యాలెండర్లను టీటీడీ అత్యద్భుతంగా రూపొందించి మొదటి సారిగా ముద్రించింది. ఇందులో మూలమూర్తితో కూడిన క్యాలెండర్లు రూ.20/-, ఉత్సవర్ల క్యాలెండర్ రూ.15/- లతో టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది.
యువతలో హైందవ సనాతన ధర్మ వ్యాప్తి కోసం 25 ఏళ్ల లోపు వారికి రామ కోటి తరహాలో గోవింద కోటి పుస్తకాలను టీటీడీ అందుబాటులో ఉంచింది. 200 పేజీలు గల గోవింద కోటి పుస్తకం ధర రూ.111/- గా నిర్ణయించింది. ఒక్కో పుస్తకంలో 39,600 వంతున, 26 పుస్తకాలలో 10 లక్షలా 1,116 సార్లు గోవిందనామాలు వ్రాసిన వారికి శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. అదేవిధంగా 253 గోవింద కోటి పుస్తకాలలో కోటి సార్లు వ్రాసిన 25 ఏళ్ల లోపు వారికి వారి కుటుంబ సభ్యులు ఐదు మందితో కలిసి ఒకసారి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం, వసతి కల్పిస్తారు.
ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.