GOVINDA NAMA ECHOES DURING GARUDA VAHANA SEVA -గ‌రుడ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప సాక్షాత్కారం

HEAVY DOWN POUR DOES NOT HAMPER DEVOTION

 TIRUMALA WITNESSES HUGE TURN OUT OF PILGRIMS ON G-DAY

Tirumala, 4 Oct. 19: Every inch of the Hill town of Tirumala has been occupied by the devotees of Sri Venkateswara Swamy thronging from different parts of the country on the big day of Garuda Seva, during the ongoing annual Brahmotsavams of Sri Venkateswara Swamy on Friday evening.

Braving the heavy downpour, the devotees did not move from their places since last day to catch the glimpse of Lord Malayappa on Garuda Vahanam and once again proved that the inclement weather will not hamper their devotion.

IMPORTANCE OF GARUDA VAHANAM:

From the rituals starting from day one of Brahmotsavams till the completion of the Nine-day religious event, Garudalwar holds a prominent place in Sri Vaishnava Sampradaya. Garuda serves His Master as temple flag-Garudadhwaja, as the carrier-Garuda Vahana and stands as an example of true “Sevaka”.

GARUDA VAHANAM COMMENCES AT 7PM:

As soon as Sri Malayappa Swamy appeared sitting gracefully on the mighty Garuda Vahanam that moved from Vahana Mandapam at the scheduled time of 7pm, the entire hill town reverberated to the frenzied rhythmic chants of “Govinda… Govinda…” by devotees.

KASULA HARAM A SPECIAL ATTRACTION

The mighty Garuda Vahanam surged ahead with the Lord wearing the Sahasranama Kasula Haram, along the sacred four-mada streets. The devotees, became ecstatic with bhakti elixir by witnessing the grandeur of Lord with utmost devotion.

Rare ornaments were adorned to the utsava idols during Garuda Seva.

The beauty of the Sri Malayappa Swamy sitting majestically on the shoulders of Garuda was the most awaited sight to tens of thousands of eyes which witnessed the grand procession of Garuda Seva.

ELABORATE ARRANGEMENTS BY TTD

For the devotees who remained outside the galleries, TTD has made their stay comfortable with water, buttermilk, beverages, snacks etc. They also witnessed Garuda Seva through LED screens erected at various places in Tirumala.

Additional toilets were in place to meet the demands of aged, women and children in their long wait. 

TTD CHAIRMAN, EO THANKS ALL

TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Additional EO Sri Dharma Reddy, CVSO Sri Gopinath Jatti thanked employees, Srivari Sevakulu, Scouts and Guides, police personnel, TTD Vigilance sleuths and above all pilgrims who co-operated with the temple management and made the event a grand spectacular fabulous success.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

గ‌రుడ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప సాక్షాత్కారం

అక్టోబరు 04, తిరుమ‌ల‌, 2019:  శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్ర‌వారం రాత్రి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు త‌న‌కెంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్త‌కోటికి ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండ‌గా భక్తుల కోలాటాలు, డ్రమ్స్‌ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా సాగింది. అన్ని గ్యాల‌రీల వ‌ద్ద స్వామివారిని అటు ఇటు తిప్పుతూ భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

కాగా, బ్రహ్మోత్సవాలలో ఆరో రోజైన శ‌నివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు హ‌నుమంత వాహ‌నం, సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థం, రాత్రి 8 నుండి 10 గంటల వరకు గ‌జ‌వాహనంపై శ్రీవారు ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

 ఈ కార్యక్రమంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ పృథ్విరాజ్,  ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, శ్రీమ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి, శ్రీ కృష్ణ‌మూర్తి, శ్రీ శివ‌కుమార్ తదిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.