GOVINDA, SRINIVASA, SRI VENKATESA CHANTING RREBOUNDS AT NADA NEERAJANAM_ నాదనీరాజనం వేదికపై భక్తులను తన్మయత్వంలో ముంచెత్తిన నామసంకీర్తన

Tirumala 24 September 2017: Govinda, Srinivasa, Sri Venkatesa chanting rebounded at Nada Niranjanam platform in the court yard of Srivari temple setting a new wave of cultural feast to devotees who have thronged the temple shrine for the second day of the Brahmotsavam-2017.

The Hyderabad team led by JS Eashwar Prasad presented nama sankeertan at the Nada Niranjanam open air auditorium. The resounding bhajan moved even the audience who joined chorus. The Eswar team of 12 artists set the devotional mood of the audience.

The artists were presenting the cultural bonanza of bhakti music, folk arts, dance and Harikathas are presented by the Annamacharya project, HDPP, Dasa Sahitya, and SV Dance and music college to present a feast of bhakti entertainment to the devotees.

The Team of K Eswaramma, K Ravi prabha presented mangala dwani, while the 45 students and 6 teachers of Veda pathasala of Dharmagiri presented Chaturveda parayanam, while the P Parvati team presented Vishnu Sahasranamam and discourse by Dr T V Narasimhacharyulu.

Later in the afternoon TTD asthana pundits Sri G Balakrishna Prasad and team presented Annamacharya sankeertans. In the evening the Sri JS Iswaraprasad team.

At night the Divya Giridhar team from Bangalore presented sankeertan at the Unjal seva followed by the harikathaganam by the Smt Mugilicherla Nagamani team from Tenali.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTDs,TIRUPATI

శ్రీనివాసా గోవిందా… శ్రీవేంకటేశా గోవిందా….

నాదనీరాజనం వేదికపై భక్తులను తన్మయత్వంలో ముంచెత్తిన నామసంకీర్తన

భక్తులను అలరిస్తున్న ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు

సెప్టెంబర్‌ 24, తిరుమల 2017: తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం రాత్రి జరిగిన హైదరాబాద్‌కు చెందిన శ్రీ జె.ఎస్‌.ఈశ్వర్‌ప్రసాద్‌ నామసంకీర్తన భక్తులను తన్మయత్వంలో ముంచెత్తింది. శ్రీనివాసా గోవిందా.. శ్రీవేంకటేశా గోవిందా.. అంటూ సాగిన భజన కీర్తనకు భక్తులు సైతం చేతులు కలిపి మైమరచిపోయారు. చిరుజల్లులు కురుస్తుండగా నామసంకీర్తన హోరుతో తిరుమలగిరులు పులకించిపోయాయి. శ్రీ జె.ఎస్‌.ఈశ్వర్‌ప్రసాద్‌ సంప్రదాయ నామసంకీర్తన చేయడంలో దిట్టగా పేరుగాంచారు. మొత్తం 12 మంది బృందంతో సాగిన ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తింది.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మూత్సవాలను పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్యప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం వద్ద ఏర్పాటుచేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం ఉదయం 5.00 నుండి 5.30 గంటల వరకు కె.ఈశ్వరమ్మ, కె.రవిప్రభ బృందంచే మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులచే చతుర్వేదపారాయణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7.00 గంటల వరకు తిరుపతికి చెందిన పి.పార్వతి బృందంచే విష్ణుసహస్రనామం, ఉదయం 7.00 నుండి 8.30 గంటల వరకు నెల్లూరుకు చెందిన డా|| టి.వి.నరసింహాచార్యులు ధార్మిక ప్రవచనం చేశారు.

మధ్యాహ్నం 4.00 నుంచి 5.30 గంటల వరకు టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీజి.బాలక ష్ణప్రసాద్‌ బృందం అన్నమాచార్య సంకీర్తనలను మృదుమధురంగా గానం చేశారు. సాయంత్రం 5.30 నుంచి 7.00 గంటల వరకు శ్రీ జె.ఎస్‌.ఈశ్వర్‌ప్రసాద్‌ బ ందం నామసంకీర్తనం జరిగింది. రాత్రి 7.00 నుంచి 8.00 గంటల వరకు ఊంజల్‌సేవలో బెంగళూరుకు చెందిన దివ్య గిరిధర్‌ బృందం సంకీర్తనల ఆలాపన, రాత్రి 8.00 నుంచి 9.30 గంటల వరకు తెనాలికి చెందిన శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతాణి హరికథాగానం చేశారు.

అదేవిధంగా తిరుమలలోని ఆస్థానమండపంలో ఆదివారం ఉదయం 11.00 నుంచి 12.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి జి.కల్యాణి బ ందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.