GOVINDARAJA BLESSES FROM ASWA VAHANA _ అశ్వవాహనం శ్రీ గోవిందరాజస్వామి అభయం
Tirupati, 25 May 2021: Processional deity of Sri Govindaraja Swamy took a celestial ride on Aswa Vahana on Tuesday, the penultimate day of annual Brahmotsavams of Sri Govindaraja Swamy temple held in Ekantam following Covid-19 guidelines.
The Aswa Vahana indicated the absolute dominance of Sri Govindaraja on all five elements and is also highlighted as Kalki incarnation for protection good by punishing the evil.
Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswami and Sri Sri Sri Chinna Jeeyarswami, Special Grade DyEO Sri Rajendrudu, AEO Sri Ravi Kumar Reddy, archakas and staff were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అశ్వవాహనం శ్రీ గోవిందరాజస్వామి అభయం
తిరుపతి, 2021 మే 25: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం సాయంత్రం అశ్వవాహనం శ్రీ గోవిదంరాజస్వామివారు అభయమిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవ నిర్వహించారు.
అశ్వాన్ని అధిరోహించిన స్వామివారు ఇంద్రియ నియామకుడు. స్వామి అశ్వ వాహనంపై దర్శనమిచ్చి, తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ తనను శరణు కోరడం ద్వారా కలిదోషాలకు దూరం కావచ్చునని తెలియజేస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్‌రెడ్డి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.