GOVINDARAJA GETS GIFTS FROM  VENKATESWARA _ వైభవోపేతంగా గోవిందరాజుని గరుడ సేవ

RR. 10 LAKH WORTH JEWELS PRESENTED

TIRUPATI, 20 MAY 2024: On the auspicious occasion of Garuda Seva on Monday evening as part of the ongoing annual Brahmotsavam at Sri Govindaraja Swamy temple in Tirupati, Rs. 10 lakh worth of ornaments were presented from Tirumala temple.

Speaking on the occasion, TTD EO Sri AV Dharma Reddy who handed over the jewels to Sri GT said, three ornaments viz. Diamond Pogulu, Lakshmi Kasu Mala Tella Ralla Patakam were presented to His elder brother Govinda Raja Swamy by Tirumala Venkateswara. These jewels will be adorned to the deities in the temple.

Later, Sri Govindaraja atop mighty Garuda Vahana with all religious splendour, blessed His devotees along four mada streets amidst pomp and gaiety.

The paraphernalia led by caparisoned elephants, horses, colourful dancing troupes, kolatam artists enhanced the royalty of the procession.

Both the Pontiffs of Tirumala, JEOs Smt Goutami, Sri Veerabrahmam, Agama Advisors, FACAO Sri Balaji, SE2 Sri Jagadeeshwar Reddy, DyEO Smt Shanti, VGO Sri Bali Reddy and other office staff, huge number of devotees were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గరుడ గమన గోవిందా…

వైభవోపేతంగా గోవిందరాజుని గరుడ సేవ

కానుకగా రూ.10 లక్షల విలువైన శ్రీవారి ఆభరణాలు

తిరుపతి, 20 మే 2024: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గరుడసేవ సందర్భంగా తిరుమల శ్రీవారి కానుకగా రూ.10 లక్షల విలువైన ఆభరణాలు సమర్పించారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ, తన అన్నగారైన శ్రీ గోవిందరాజునికి తిరుమల శ్రీవారు దాదాపు రూ.పది లక్షలు విలువ చేసే 03 ఆభరణాలు…వజ్రపు పోగులు, లక్ష్మి కాసు మాల, తెల్ల రాళ్ల పతకాన్ని బహుకరించారని తెలిపారు.

అనంతరం సర్వంగ సుందరంగా అలంకరింప బడ్డ శ్రీ గోవిందరాజ స్వామి సకల వైభవంతో శక్తివంతమైన గరుడవాహనంపై, నాలుగు మాడ వీధుల వెంట విహారిస్తూ, ఆనందోత్సాహాల మధ్య తన భక్తులను ఆశీర్వదించారు.

ఏనుగులు, గుర్రాలు, రంగురంగుల నృత్య బృందాలు, కోలాటం కళాకారుల ప్రదర్శనలు వాహన ఊరేగింపు శోభను మరింత ఇనుమడింప చేసాయి.

తిరుమల పీఠాధిపతులు, జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు, ముఖ్య ఆర్థిక శాఖధికారి శ్రీ బాలాజీ, ఎస్ ఈ 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈ ఓ శ్రీమతి శాంతి, భద్రతాధికారి శ్రీ బాలి రెడ్డి మరియు ఇతర కార్యాలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది