GOVINDARAJA SWAMY ANNUAL FESTIVAL _ మే 26 నుండి జూన్ 3వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 

TIRUPATI, 19 MAY 2023: The annual brahmotsavams of Sri Govindaraja Swamy temple in Tirupati are scheduled between May 26 and June 3 with Ankurarpanam on May 25.

The important days includes Dhwajarohanam on May 26, Garuda Vahanam on May 30, Rathotsavam on June 2 and Chakra Snanam on June 3.

TTD has arranged devotional cultural programmes during this period.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మే 26 నుండి జూన్ 3వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2023 మే 19: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 26 నుండి జూన్ 3వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 25వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.

వాహనసేవల వివరాలు :

తేదీ                        ఉదయం              సాయంత్రం

26-05-2023     ధ్వజారోహణం         పెద్దశేష వాహనం

27-05-2023    చిన్నశేష వాహనం     హంస వాహనం

28-05-2023   సింహ వాహనం      ముత్యపుపందిరి వాహనం

29-05-2023   కల్పవృక్ష వాహనం    సర్వభూపాల వాహనం

30-05-2023  మోహినీ అవతారం   గరుడ వాహనం

31-05-2023  హనుమంత వాహనం   గజ వాహనం

01-06-2023  సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

02-06-2023  రథోత్సవం  అశ్వవాహనం

03-06-2023  చక్రస్నానం ధ్వజావరోహణం

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.