GRAND AMAVASYA FESTIVITIES AT SRI KRT_ శ్రీకోదండరామాలయంలో వైభవంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ

Tirupati, 30 Aug. 19: TTD organised grand festivities of Sahasra Kalashabisekam on Friday morning as part of the Amavasya celebrations at the TTDs local temple of Sri Kodandaramaswami temple.

Later in the evening the richly decorated utsava idol of Sri Kodandaramaswami was taken out on Hanumanta vahanam along the Mada streets and blessed the vast crowd of devotees.

The devotees who participated in the abishekam with a ticket of ₹500 and were presented one uttarium, one blouse, Laddu, vada as Prasadam.

DyEO Smt VR Shanti, AEO Sri Thirumalaiah temple inspector Sri Ramesh, temple priests and other officials and devotees participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీకోదండరామాలయంలో వైభవంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ

తిరుపతి,2019 ఆగస్టు 30: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా సహస్రకలశాభిషేకం, హనుమంత వాహనసేవ వైభవంగా జరిగాయి.

వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ‌ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు చాలా విశిష్టత ఉంటుంది. అమావాస్య నాడైన శుక్రవారం ఉదయం 6.30 నుండి 8.30 గంటల నడుమ సహస్ర కలశాభిషేకం సేవ వైభవంగా నిర్వహించారు. రూ.500/- చెల్లించి పాల్గొన్న గృహస్తులకు(ఇద్దరు) ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేశారు.

కాగా రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు హనుమంత వాహనసేవ వేడుకగా జరుగనుంది. సర్వాలంకార భూషితులైన శ్రీకోదండరామస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రామభక్తుడైన హనుమంత వాహనసేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్‌.శాంతి, ఏఈవో శ్రీతిరుమలయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రమేష్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.